రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనేది జగమేరిగిన సత్యం.ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న నేత, ప్రతిపక్షంలో ఉన్ననేతలు ఒకరినొకరు ఎల్లప్పుడూ విమర్శించుకుంటూనే ఉంటారు.
రాజకీయాల్లో ఈరోజు ప్రతిపక్షం రేపటి అధికార పక్షం కూడా కావొచ్చు.అందుకే రాజకీయ నేతలు పార్టీల పరంగా దూషించుకుంటారు కానీ వ్యక్తిగతంగా ఎప్పుడూ దూషించుకోరు.
ఈ సంప్రదాయం ఉంది కాబట్టే ఎన్నికల టైం దగ్గర పడే కొద్దీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి, ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి నాయకులు జంపింగులు చేస్తారు.
అంతేకాకుండా ప్రస్తుత జరుగుతున్న అభివృద్ధి పనులను పొలిటికల్ పార్టీలు తమ ఘనత వల్లే సాధ్యమైందని డప్పుకొంటుకుంటున్నారు.
గత ప్రభుత్వాలకు ఆ హక్కు దక్కనివ్వరు.ఈ క్రమంలోనే సీఎం జగన్ కూడా ఏపీలో మీటింగ్ నిర్వహించినప్పుడల్లా తన మూడేళ్ల ప్రభుత్వం హయాంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందినదని.
గతంలో ఏమాత్రం చెందలేదు అన్నట్టు ప్రచారం నిర్వహించుకుంటున్నారు.ఇదే ప్రస్తుతం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది.
చంద్రబాబు 14ఏళ్ల పాటు పనిచేసిన సీఎం.ఆయన ముద్ర ఏపీ మీద చాలానే ఉంటుంది.
అంతేకాకుండా ఏపీ డెవలప్‌మెంటులో వైఎస్సార్ లాంటి వారి కృషి కూడా ఉందనడంలో అతిశయోక్తి లేదు.
ఇది వాస్తవమైతే మూడేళ్ళ సీఎం జగన్ అంతా నావల్లే ఏపీ ప్రగతి అని అనడమే ఇపుడు చర్చగా ఉంది.ఏపీలో ఏ ఒక్క కార్యక్రమం అయినా తన చలువే ఇదంతా అని జగన్ గట్టిగానే డబ్బాలు కొట్టుకుంటున్నారా అని సొంత పార్టీ వారే విస్మయపడే పరిస్థితి.స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో సీఎం జగన్ మాట్లాడుతూ.
ఏపీలో అభివృద్ధి అంతా మూడేళ్ళలోనే సాగిందని చెప్పడం విశేషంఇక ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురంలో జరిగిన ఒక ప్రారంభోత్సవంలో కూడా జగన్ చేసిన కామెంట్స్ మీద చర్చ సాగుతోంది.ఏపీలో పారిశ్రామిక ప్రగతి తమ ప్రభుత్వ ఘనత అని ఆయన వెల్లడించారు.
మరి ఏపీలో సంక్షేమమైనా అభివృద్ధి అయినా, పారిశ్రామిక ప్రగతి అయినా ఒక్క రోజులో రాలేదుజ.ఒక్కరితో ఆగలేదు ఏ ఒక్కరి సొత్తుగానో అవి సాగలేదన్నది సత్యం.రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి నాటి కాంగ్రెస్ సీఎంలు ఎంతో కృషి చేశారు.అలా చూసుకుంటే కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి, జలగం వెంగళరావు, చెన్నారెడ్డి, వైఎస్సార్, చంద్రబాబు వంటి వారి పేర్లను వరసగా చెప్పుకోవాలి.
సంక్షేమం పరంగా చూస్తే సీనియర్ ఎన్టీయార్‌ను ఆధ్యుడిగా ఏపీ వరకూ చెప్పుకోవాలి ఆ తరువాత మరిన్ని అడుగులు వేసిన ఘనత వైఎస్సార్ ది.