హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.ఈ మేరకు నూతన సంవత్సర వేడుకలను డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఒంటి గంటకే ముగించాలని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఈ క్రమంలోనే ఈవెంట్ నిర్వాహకులు పది రోజులు ముందే అనుమతి తీసుకోవాలని సీపీ పేర్కొన్నారు.అలాగే ప్రతి ఈవెంట్ లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.
కెపాసిటీకి మించి పాసులు ఇవ్వొద్దన్న సీపీ ఈవెంట్స్ లో సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిందేనని తెలిపారు.పార్టీల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్ధం ఉండకూడదని చెప్పారు.
న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.