తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ నిర్వహణకు పోలీసుల అభ్యంతరం

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ నిర్వహణకు పోలీసులు అభ్యంతరం తెలిపారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో దీక్షా దివస్ నిర్వహణకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు.

దీంతో పోలీస్ ఉన్నతాధికారులను బీఆర్ఎస్ లీగల్ టీమ్ సంప్రదించింది.అయితే పోలీస్ ఉన్నతాధికారుల నుంచి సైతం సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది.

ఎన్నికల నిబంధనల ప్రకారం దీక్షా దివస్ నిర్వహించొద్దని అధికారులు తెలిపారు.ఈ క్రమంలోనే పోలీస్ ఉన్నతాధికారులపై న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

దీక్షా దివస్ నిర్వహణకు అనుమతి అవసరం లేదని ఎన్నికల అధికారులు చెప్పారని బీఆర్ఎస్ లీగల్ టీమ్ తెలిపిందని చెప్పారు.అంతేకాకుండా పార్టీ కార్యాలయాల్లో 144 సెక్షన్ అమలు కాదని న్యాయవాదులు చెబుతున్నారని సమాచారం.

Advertisement

ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?
Advertisement

తాజా వార్తలు