తాడిపత్రి మండలం ఆలూరు గ్రామంలో గత వారం రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా శనివారం స్వామి వారికి కళ్యాణం, రథోత్సవం నిర్వహించారు.ఎద్దుల పోటీలు నిర్వహించారు.రాతిదూలం పోటీలు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రారంభించి రథోత్సవాన్ని తిలకించడానికి ఆలూరు గ్రామంలో ఉన్న సమయంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆలూరు గ్రామం వచ్చేందుకు ప్రయత్నించారు.
అయితే సజ్జలదిన్నె గ్రామం వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆలూరులో ఉన్నారని ఆయన వెళ్లిన వెంటనే మిమ్మల్ని గ్రామంలో పంపుతామని జేసీ ప్రభాకర్ రెడ్డితో చెప్పగా సిఐ చిన్న పెద్దయ్యకు, జేసీ ప్రభాకర్ రెడ్డి కి మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది.
కొద్దిదూరం కారు దిగి నడుచుకుంటూ వెళ్లిన ప్రభాకర్రెడ్డిని రూరల్ సిఐ చిన్న పెద్దయ్య నచ్చ చెప్పడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆలూరు గ్రామం నుండి వెళ్ళిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆలూరు గ్రామంలోకి తానే తీసుకెళ్తానని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.







