మహిళా దినోత్సవం రోజు విదేశీ మహిళను నమ్మించి అత్యాచారయత్నానికి ప్రయత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించి గూడూరు పోలీసులు వారిని అరెస్టు చేసి నెల్లూరు జిల్లా గూడూరులోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే లుదీనియా దేశానికి చెందిన కరోలినా అనే మహిళ భారతదేశ విహారయాత్రకు శ్రీలంక నుంచి గోవాకు చెన్నై ద్వారా వెళ్లేందుకు చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగింది.బెంగళూరు బస్సు ఎక్కి ఇండియన్ కరెన్సీ లేనందున బస్సు డ్రైవర్ ఆమెను బస్సు దించి వేసే క్రమంలో ఇంగిలాల సాయి కుమార్ ఆమెకు డబ్బులు ఇచ్చారు.
ఆమెను నమ్మించి వెంకన్నపాలెం తీసుకుని వెళ్లారు.తన స్నేహితుడైన సయ్యద్ అభిద్ తో కలిసి విదేశీ మహిళను బైక్పై ఎక్కించుకుని సైదాపురం అడవిలోకి తీసుకువెళ్ళారు.
అక్కడ అత్యాచారయత్నానికి ప్రయత్నించగా కరోలినా వారి చెర నుంచి తప్పించుకుని సైదాపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.తక్షణమే స్పందించిన పోలీసులు ఎస్పీ ఆదేశాలతో నిందితులను చిల్లకూరు జంక్షన్లో నేషనల్ హైవేపై అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్న పాలెం కు చెందిన ఇంగిలాల సాయి కుమార్, గూడూరు శారద నగర్ కు చెందిన సయ్యద్ అభిద్ గా వారిని గుర్తించారు.గూడూరు రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి ఈ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు
.






