చిన్న వయసులోనే యూట్యూబ్ స్టార్ మృతి.. తండ్రి పోస్ట్ వైరల్!

ఆస్ట్రేలియన్ కు చెందిన ప్రముఖ ర్యాపర్, యూట్యూబ్ స్టార్ లివ్ బో వీప్ తాజాగా అకాల మరణం చెందింది.ఈమె మార్చి 3వ తేదీన తుది శ్వాస విడిచింది.

 Australian Rapper Youtube Star Lil Bo Weep Dies 22 , Youtube Star , Rapper , Pas-TeluguStop.com

ప్రస్తుతం ఈమె వయస్సు 22 ఏళ్ళు.ఇంత చిన్న వయసులోనే ఆమె మరణించడం బాధాకరం అని చెప్పవచ్చు.

ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.అంతేకాకుండా ర్యాపర్ గా యూట్యూబ్ స్టార్ గా ఈమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

ఈమె అకాల మరణం గురించి తన తండ్రి మాత్క్యు స్కోఫీల్డ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ డిప్రెషన్, బాధ,పిటీఎస్ డీ, డ్రగ్స్ కు వ్యతిరేకంగా తన కూతురు కోసం వారం రోజుల పాటు పోరాడాను అని తెలిపారు.

అమెరికా నుంచి ఆమెను తీసుకు వచ్చినప్పటి నుంచి ఆమెను కాపాడటం కోసం తన తండ్రి కుటుంబ సభ్యులు పోరాడుతూనే ఉన్నారట.కానీ చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది మేము కూడా ఓడిపోయాను అని రాసుకొచ్చారు.

అయితే ఆమె అకాల మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె చావు గల కారణం హాట్ టాపిక్ గా మారింది.

Telugu Australian, Drugs, Lil Weep, Ptsd, Rapper, Youtube-Movie

ఆమెను నిత్యం ఫాలో అయ్యేవారు ఆమె మరణానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి తాపత్రయపడుతున్నారు.ఇక ఆమె మరణవార్త విన్న అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ ఐ లవ్ యు, ఐ యాం సారీ బేబీ గర్ల్, మరో జీవితం, రెస్ట్ ఇన్ పీస్ వినోనా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.అభిమానులు ఆమె మృతి పట్ల స్పందించిన తీరు చూసి ఆమెకు తండ్రి అయినందుకు గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చారు తన తండ్రి.నా కూతురు నా హీరో, నా కూతురు నా బెస్ట్ ఫ్రెండ్, తను ఎంతలా ప్రేమిస్తున్నాను అన్నది చెప్పలేను.

ఆమె మళ్ళీ తిరిగి వస్తుంది అని రాసుకొచ్చారు.లిల్ బో విప్ అసలు పేరు వినోనా బ్రూక్స్.2015 సో సౌండ్ క్లౌడ్ లో తన సంగీత కెరీర్ ని మొదలు పెట్టింది.అలా అంచెలంచెలుగా ఎదుగుతూ విపరీతమైన ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.

అలాంటి ఆమె మృతి చెందడం చాలా బాధాకరం అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube