పుష్ప తర్వాత భీమ్లా నాయక్‌.. కొత్త ప్రయోగం కంటిన్యూ

గత సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్షేషన్ క్రియేట్‌ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా డైలాగ్ వెర్షన్ ను ఇటీవలే ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది.పుష్ప సినిమా డైలాగ్స్ కు మంచి ఆదరణ దక్కిన నేపథ్యంలో యూట్యూబ్ లో ఇలా డైలాగ్‌ లను విడుదల చేయడం కొత్తగా ఉంది అంటూ ప్రేక్షకులు మరియు అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

 Pawan Kalyan Bheemla Nayak Dialogues Audio In Adithya Music , Allu Arjun, Bheeml-TeluguStop.com

ఇప్పుడు అదే తరహా కంటిన్యూ అయింది.పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన డైలాగ్ లు ఆదిత్య మ్యూజిక్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Telugu Allu Arjun, Bheemla Nayak, Pawan Kalyan, Pushpa-Movie

గతంలో సినిమా పాటలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఆదిత్య మ్యూజిక్ ఇప్పుడు సినిమాలోని డైలాగ్స్ కూడా జ్యూక్ బాక్స్ గా విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.అల్లు అర్జున్ పుష్ప సినిమా డైలాగ్ జ్యూక్‌ బాక్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది.దాంతో భీమ్లా నాయక్ సినిమా డైలాగ్ వర్షన్‌ వీడియోలను కూడా విడుదల చేయబోతున్నట్లు ఆదిత్య మ్యూజిక్ ప్రకటించింది.ఇప్పటికే ఆడియో రైట్స్ ద్వారా భారీ మొత్తంలో ఆదిత్య మ్యూజిక్ చిత్ర నిర్మాతలకు అందిస్తూ వస్తుంది.

కొత్తగా ఈ డైలాగ్‌ వర్షన్‌ లు కూడా యూట్యూబ్ కి ఆడియో రైట్స్ ఇవ్వడం తో మరి కొంత ఆదాయం నిర్మాతలకు వస్తున్నట్లుగా విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు రానాల మధ్య సాగే పోరాట సన్నివేశాలు మరియు కీలక సన్నివేశాల్లో వచ్చే డైలాగ్స్ అభిమానులకు మరియు ఇతర ప్రేక్షకులకు గణనీయంగా ఉన్నాయి.

కనుక ప్రత్యేకంగా విడుదల కాబోతున్న ఆ డైలాగ్స్ కూడా భారీగా రెస్పాన్స్‌ దక్కే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube