ఇటీవల సోషల్ మీడియాలో రష్మిక ( Rashmika ) ఫేక్ వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే.ఆ వీడియో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.
పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఒక వారం రోజులపాటు ఎక్కడ చూసినా కూడా ఈ వీడియో గురించే చర్చించుకున్నారు.
అంతేకాకుండా పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి.ఈ వీడియోపై కేంద్రం స్పందించడంతో పాటు ఢిల్లీ మహిళా కమిషన్ కూడా దృష్టి పెట్టింది.
ఇక రష్మిక డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు( Delhi Police ) కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కీలక పురోగతిని సాధించారు ఢిల్లీ పోలీసులు.బీహార్ కు( Bihar ) చెందిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.అతడి వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే.
అయితే నిజానికి ఈ డీప్ ఫేక్ వీడియో( Deep Fake Video ) తయారు చేసింది అతడు కాదు.కానీ మొదటి షేర్ చేసిన వ్యక్తి మాత్రం ఇతనే.
అయితే వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలి అని మెటాకు( Meta ) పోలీసులు లేఖ కూడా రాశారు.కాగా మెటా ఇచ్చిన వివరాల ఆధారంగా బీహార్ కి చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
అతనికి వీడియో ఎక్కడ దొరికింది అన్న వివరాలు ఆరా తీసే ప్రయత్నంలో ఉన్నారు.అయితే మరొక సోషల్ మీడియా వేదిక నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసినప్పుడు సదరు యువకుడు తెలిపాడు.
ఇప్పటివరకు ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదు.కేవలం విచారిస్తున్నారు.ఈ వీడియోపై హీరోయిన్ రష్మిక కూడా స్పందిస్తూ సీరియస్ గా రియాక్ట్ అయిన విషయం తెలిసిందే.ఇకపోతే హీరోయిన్ రష్మిక విషయానికి.పుష్ప సినిమాతో( Pushpa ) పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆ రష్మిక మందన ప్రస్తుతం హిందీలో యానిమల్( Animal ) సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది.అలాగే పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉంది.