జబర్దస్త్ షో మీద పోలీసు కేసు

తెలుగు టీవి రియాల్టీ షోలలో కొత్త శకానికి నాంది పలికింది జబర్దస్త్.ఖతర్నాక్ కామెడీ షో.

విభిన్నమైన స్కిట్స్ - కడుపుబ్బ నవ్వించే కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ కార్యక్రమం.ఫ్యామిలీ ఎంటర్టెయినర్ గా మంచి ప్రజాదరణ అందుకుంది.

ఆ తర్వాత క్వాలిటీ పెంచడం కోసం అనుకుని.కామెడీలో బూతును కూడా మిక్స్ చేయడం మొదలుపెట్టడంతో విమర్శలు కూడా వచ్చాయి.

వీటికి తోడు వరుస వివాదాలతో ఇప్పుడీ జబర్దస్త్ అభాసుపాలవుతోంది.రీసెంట్ గా జబర్దస్త్ లో ప్రసారం చేసిన ఓ స్కిట్ పై కోర్టు నోటీసులు జారీ చేసింది.

Advertisement

భారతీయ న్యాయవ్యవస్థను అవమానించారంటూ ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశాడు.దీనిని అంగీకరించిన కోర్టు.

జబర్దస్త్ టీంకు నోటీసులు జారీ చేసింది.గతంలో కూడా ఇలాంటి అనేక వివాదాలు జబర్దస్త్ ను చుట్టుముట్టాయి.

గతంలో ఓ స్టూడెంట్ యూనియన్ లీడర్ ఈ కార్యక్రమంపై కేసు నమోదు చేశాడు.ఆ తర్వాత గౌడ మహిళలను అవమానించారంటూ.

కమెడియన్ వేణుపై దాడి కూడా జరిగింది.కామెడీ పేరుతో అసంబద్ధమైన స్కిట్స్ ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అటు పార్టిసిపెంట్స్ తో పాటు ఇటు జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగేంద్ర బాబు రోజాలపై కూడా విమర్శలు ఎక్కువయ్యాయి.

Advertisement

తాజా వార్తలు