సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాలి దేవాలయం వద్ద బీజేపీ నేతలు తలపెట్టిన ధర్నాను అడ్డుకున్న పోలీసులు

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాలి దేవాలయం వద్ద బీజేపీ నేతలు తలపెట్టిన దర్బాను అడ్డుకున్న పోలీసులు, పోలీసులకు నేతలకు మధ్య వాగ్వివాదం, తోపులాట ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

నేతలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, మాజీ మేయర్ బండ కార్తికా రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున బీజేపీ శ్రేణులు ఉదయం 10గంటలకే దేవాలయ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు.అంతకు ముందే పోలీసులు భారీఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసి ఎక్కడి కక్కడ కంచెలు ఏర్పాటు చేశారు.

అయినా గుంపులుగా కాకుండా ఒక్కరొక్కరుగా దేవాలయం వద్దకు చేరుకున్నారు.అక్కడికి చేరుకున్న నేతలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి మాట్లాడుతూ పోలీసుల తీరును ఆక్షేపించారు.కనీసం తమకు దర్శనం చేసుకోడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడమెంటని ప్రశ్నించారు.

Advertisement

శాంతియుతంగా ఆందోళన చేయడానికి వచ్చిన తమను అరెస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.దేవాలయములో జరిగిన అవినీతిని అరికట్టని ప్రభుత్వం తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల ఆస్తులు దోచుకున్నది కాకుండా దేవాలయ కానుకలు, ఆస్తులను దోచుకుంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉన్నట్లు ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు.స్థానిక మంత్రి కూడా పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవినీతి అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.దేవాలయ ఆస్తులు, భూములను కాపాడడం కోసం బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు