నెదర్లాండ్స్( Netherlands ) ప్రజలను ఒక పాము వణికిస్తోంది.రీసెంట్ గా ఆఫ్రికాకు చెందిన అత్యంత విషపూరిత పాము అయిన గ్రీన్ మాంబా( Green Mamba ) నెదర్లాండ్స్‌లోని టిల్‌బర్గ్‌లోని( Tilburg ) తన యజమాని ఇంటి నుంచి తప్పించుకుంది.ఆ పాము ఏకంగా రెండు మీటర్ల పొడవు ఉంది.అంటే ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.ఇక దాని చర్మం బ్రైట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది.ఇవి చాలా నెర్వస్‌గా ఫీల్ అవుతాయి కాబట్టి మనుషులను చూడగానే వారు హాని చేస్తారేమోనని ఇవి ముందుగానే కాటు వేసే ప్రమాదం ఉంది.
కాటు వేస్తే నేరుగా కాటుకే వెళ్లిపోయే ముప్పు ఉంటుంది కాబట్టి స్థానిక అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి పాము కనిపిస్తే దూరంగా ఉండాలని సూచించారు.
అత్యంత విషపూరితమైన ఈ పాము తమ పరిసరాల్లోకి వచ్చిందేమో అని స్థానికులు చాలా భయపడుతున్నారు.
పాము యజమాని సోమవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పామును కనుగొని పట్టుకోవడంలో సహాయం చేయడానికి పోలీసులు వివిధ దేశాలకు చెందిన పలువురు నిపుణులను సంప్రదించారు.
పాము వాసనను తెలుసుకోవడానికి వారు స్నిఫర్ డాగ్‌ను( Sniffer Dog ) కూడా ఉపయోగించారు.

గ్రీన్ మాంబా విషం చాలా శక్తివంతమైనది.చికిత్స చేయకపోతే రోజులలో మరణానికి కారణమవుతుంది.పాము సాధారణంగా పక్షులు, చిన్న క్షీరదాలు, బల్లులను తింటుంది.
అరుదుగా మనుషులపై దాడి చేస్తుంది.అయితే ఎవరైనా పాము కాటుకు( Snake Bite ) గురైతే వెంటనే అత్యవసర సేవలకు ఫోన్ చేసి వైద్యసేవలు అందించాలన్నారు.
పాము యజమాని ఇంటిని విడిచిపెట్టే అవకాశం లేదు, ఎందుకంటే ఇది వెచ్చని, చీకటి ప్రదేశాలను ఇష్టపడుతుంది.

చలి డచ్ చలికాలం పాముకి తగిన వాతావరణం కాదు.పాము కోసం అధికారులు ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో ఇంకా గాలిస్తున్నారు.ఇకపోతే ఈ ప్రపంచంలో మూడు రకాల ఆకుపచ్చ మాంబా ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలలో కనిపిస్తాయి.
తప్పించుకున్న పాము ఏ రకానికి చెందినదో స్పష్టంగా తెలియరాలేదు.







