Poco M6 Pro స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ ఇవే..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.

పోకో కంపెనీ( Poco company ) మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరకే సరికొత్త ఫీచర్లను కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది.

తాజాగా పొకో కంపెనీ నుంచి Poco M6 Pro స్మార్ట్ ఫోన్ విడుదల అయింది.ఈ ఫోన్ కు చెందిన ధర, ఫీచర్స్ ఏంటో చూద్దాం.

ఈ Poco M6 Pro స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.4GB RAM+ 64 GB storage కలిగిన స్మార్ట్ ఫోన్ ( Smartphone )ధర రూ.14,999 గా ఉంది.4GB RAM+ 128GB storage కలిగిన స్మార్ట్ ఫోన్ ధర రూ.15,999 గా ఉంది.6GB RAM + 128 GB storage కలిగిన స్మార్ట్ ఫోన్ ధర రూ.16,999 గా ఉంది.

Poco M6 Pro స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.6.79 inch FHD+ display ను కలిగి ఉంటుంది.స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్ ఓసీ ప్రాసెసర్ ను కలిగి ఉంది.

Advertisement

తరువాత ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు.

సెల్ఫీల( Selfies ) కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందించారు.ఈ స్మార్ట్ ఫోన్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడిన 5000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు