యాదాద్రి భువనగిరి జిల్లా:గురువారం కురిసిన అకాల వర్షానికి పోచంపల్లి చెరువు కట్ట రోడ్డు చిత్తడిగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతుందని పరిసర ప్రాంతాల ప్రజల అవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒక్క వర్షానికి పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు రాబోయే రోజుల్లో పడే వర్షాలకు చెరువు కట్ట నుంచి వెళ్లే గ్రామాల ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
ఎమ్మెల్యే గారూ ఒక్కసారి వచ్చి మా పరిస్థితి ఏంటో,ఈ రోడ్డుపై నుంచి వెళ్లే గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటో కళ్ళారా చూడాలని కోరుతున్నారు.ప్రజా ప్రతినిధులు,పాలకులు మారుతున్నారు.
కానీ,మాగోడు మాత్రం ఎవరికీ పట్టడం లేడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఎన్నేళ్లు ఎదురు చూడాలి?ఎన్నడు అభివృద్ధి చెందుతుంది ఈ కట్ట రహదారి అని ప్రశ్నిస్తున్నారు.ఈ కట్ట రోడ్డున అభివృద్ధి చేస్తారా లేక ఇంకా అభివృద్ధి చేయకుండా జనాల ప్రాణాలతో ఆడుకుంటారో చెప్పండంటూ నిలదీస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధిారులు ఈ చెరువు కట్ట రోడ్డుపై దృష్టి సారించి నూతన రోడ్డు నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజల బాధలు తీర్చాలని కోరుతున్నారు.