ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) యూఏఈ పర్యటనలో బిజిబిజీగా వున్నారు.ఈ క్రమంలో దుబాయ్‌లో భారతీయ ఎంఎస్ఎంఈలు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా ఉద్దేశించిన గిడ్డంగుల సదుపాయం ‘‘ భారత్ మార్ట్’’( Bharat Mart )ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.
భారతీయ ఎగుమతిదారులకు ఒకే గొడుగు కింద వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఇది ఏకీకృత వేదిక అవుతుంది.చైనా ‘‘ డ్రాగన్ మార్ట్ ’’( Dragon Mart ) లాగానే.
భారత్ మార్ట్ కాన్సెప్ట్ ఇంకా ఖరారు కాలేదు.నివేదికల ప్రకారం.
భారత్ మార్ట్ 1,00,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో విస్తరించి వుంటుందని అంచనా.ఇది గోడౌన్‌గా, రిటైల్, హాస్పిటాలిటీ సౌకర్యాలను అందించే మల్టీపర్పస్ ఫెసిలిటీగా పనిచేస్తుంది.

డీపీ వరల్డ్( DP World ) పర్యవేక్షిస్తున్న జెబెల్ అలీ ఫ్రీ జోన్ ( JAFZA )లో వున్న భారత్ మార్ట్.వివిధ వాణిజ్య అవసరాలు, కార్యకలాపాలను అందించే సమగ్ర గమ్యస్థానంగా ఉపయోగించబడుతుంది.రిటైల్ షోరూమ్‌లు, కార్యాలయాలు, గిడ్డంగులు, భారీ యంత్రాల నుంచి వివిధ రకాల వస్తువులను అందిస్తుంది.దీనికి అదనంగా డిజిటల్ ఫ్లాట్ఫారమ్ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు వున్నాయి.తద్వారా గ్లోబల్ కొనుగోలుదారులు ఈ ఫెసిలిటీ నుంచి వస్తువులను సౌకర్యవంతంగా పొందవచ్చు.సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా 2030 నాటికి తమ పెట్రోలియం యేతర వాణిజ్య లక్ష్యాన్ని 100 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేందుకు భారత్ , యూఏఈలు ప్రయత్నిస్తున్నందున భారత్ మార్ట్ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

కాగా.ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13 , 14 తేదీల్లో రెండు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించనున్నారు.అబుదాబిలో మొట్టమొదటి హిందూ దేవాలయమైన బీఏపీఎస్ మందిర్( BAPS Mandir )ను ప్రారంభించనున్నారు.పశ్చిమాసియాలో భారతదేశానికి అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామిగా యూఏఈ( UAE )కి మోడీ ప్రాధాన్యతను ఇస్తున్నారు.
మంగళవారం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న నరేంద్ర మోడీకి యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు.భారత్, యూఏఈలు సముద్ర, రైలు మార్గాలను ఉపయోగించి మధ్యప్రాచ్యంలోని ఎంపిక చేసిన ప్రాంతాల ద్వారా ఐరోపాను భారత్‌తో అనుసంధానించడానికి రూపొందించిన వాణిజ్య కారిడార్ కోసం మంగళవారం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.