నవంబర్ 19, ఆదివారం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు అత్యంత ముఖ్యమైన రోజు అయ్యింది.ఆరోజు అందరూ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్( World Cup Final ) చూస్తూ టీవీలకు అతుక్కుపోయారు.
ఒక లక్షా 30 వేల మంది స్టేడియంకి వెళ్లి మరీ ఈ మ్యాచ్ చూసారు.సిటీల్లో, గ్రామాల్లో ప్రొజెక్టర్లు పెట్టుకుని, వందల మంది ఒకే దగ్గర గుమిగూడి ఈ మ్యాచ్ ఎంజాయ్ చేశారు.
భారత్( India ) విజయం కోసం అందరూ ప్రార్థించారు కానీ మనోళ్ళు ప్రెజర్ తట్టుకోలేక చతికిలబడ్డారు.దాంతో ఆస్ట్రేలియా( Australia ) వరల్డ్ కప్ ఎగరేసుకుపోయింది.
ఈ మ్యాచ్ చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) కూడా వచ్చారు.టీమ్ ఇండియా విజయంపై ఆటగాళ్లను కంగ్రాచ్యులేట్ చేయాలని ఎంతో ఆశించారు కానీ ఆ ఛాన్స్ ఇవ్వడానికి ఆస్ట్రేలియా ఒప్పుకోలేదు.వారే గెలిచి మరోసారి వరల్డ్ కప్ విజేతలుగా అవతరించారు.ఈ నేపథ్యంలోనే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో మోదీ క్రికెట్ ఆడుతున్నట్లు కనిపించింది.వైరల్ వీడియోలో దేశ ప్రధాని మోదీ లాంటి ఒకరు పర్ఫెక్ట్ షాట్ కొట్టినట్టు కూడా కనిపించింది.
అయితే చూసేందుకు అతను సరిగ్గా మోదీ లాగానే ఉన్నారు.నిజానికి ఆ షాట్ కొట్టింది, ఈ వీడియోలో ఉన్నది మోదీ కాదు.
మోదీ లాగానే కనిపించే యువరాజ్ సింగ్( Yuvraj Singh ) తండ్రి యోగరాజ్ సింగ్.( Yograj Singh )
వెనుక నుంచి చూస్తే ప్రధాని మోదీలానే కనిపిస్తున్నారు.అందుకే ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి అందులో ఉన్నది మోదీనే అని చాలామంది భావిస్తున్నారు.ఆ వీడియో క్యాప్షన్‌లో ఈ వ్యక్తి క్రికెట్ ఆడేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడని, అవసరమైతే టీమ్ ఇండియాకు పద్ధతిగా బరిలోకి దిగడానికి రెడీ అన్నట్లు యాక్షన్ జోడించారు.
కానీ ఆ వ్యక్తి పేరు వెల్లడించలేదు.కాబట్టి దాదాపు అందరూ ఈ బ్యాట్ పట్టింది మన దేశ ప్రధాని అని పొరపాటు పడుతున్నారు.టీమ్ ఇండియా బ్యాటర్లు ఫెయిల్ అయితే మోదీ దిగడానికి నిజంగా రెడీ అయ్యారా అని ఆశ్చర్యపోతూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.గతంలో కూడా ఈ వీడియో వైరల్ అయింది.
మళ్ళీ వరల్డ్ కప్ సందర్భంగా వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.