అయోధ్య( Ayodhya )లోని రామ మందిరంలో ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు మరి కాసేపటిలో ప్రధాని మోదీ( Narendra Modi ) అయోధ్య ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.
తరువాత ఉదయం 10.55 గంటలకు రామ జన్మభూమికి ప్రధాని మోదీ చేరుకుంటారు.ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు సభను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.మధ్యాహ్నం 2.10 గంటలకు కుబేర్ తిలాను సందర్శించనున్నారు.