లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ( BJP ) ప్రచారంలో దూకుడు పెంచింది.ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) తెలంగాణలో( Telangana ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
ఈ మేరకు రేపు తెలంగాణకు మోదీ రానున్నారు.దాదాపు పది రోజుల వ్యవధిలోనే రాష్ట్రానికి ఆయన రావడం రెండోసారి కావడం విశేషం.
కాగా మోదీ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
రేపు సాయంత్రం మల్కాజ్ గిరిలో మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు.మీర్జాలగూడ నుంచి మల్కాజ్ గిరి వరకు సుమారు 1.3 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో కొనసాగనుంది.16వ తేదీన నాగర్ కర్నూల్ లో( Nagar Kurnool ) బీజేపీ ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు.తరువాత 18న జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు.
మోదీ పర్యటన, ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర కమలనాథులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.