దేశవ్యాప్తంగా త్వరలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ( PM Modi ) బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇదే సమయంలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.శనివారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో( Madhya Pradesh ) ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై( Congress Leaders ) సెటైర్ల మీద సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ నేతల డైలాగులు ప్రకటనలు వారి పాత్రలు అన్నీ సినిమా తరహాలోనే ఉంటాయని అభివర్ణించారు.కాంగ్రెస్ దేశం మొత్తం తప్పుడు హామీలు ఇస్తూ ఉంటది.
అభివృద్ధికి రోడ్డు మ్యాప్ రూపొందించడం కూడా ఆ పార్టీకి రాదు.

కాంగ్రెస్ హామీలు సినిమా డైలాగులు మాదిరిగా ఉంటాయని వ్యాఖ్యానించారు.మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో బట్టలు చింపుకునే పోటీ జరుగుతుందని మోదీ( Modi ) పేర్కొన్నారు.డిసెంబర్ 3వ తారీకు ఎన్నికల ఫలితాలు రాగానే ఇది మరింత తీవ్రతరంగా మారుతుందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశం ఇస్తే ప్రజల ఒంటిమీద కూడా బట్టలు చింపేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు( Madhya Pradesh Congress Leaders ) ముఖ్యమంత్రి పదవి కోసం కొట్టుకోవడం లేదు వాళ్లు వారి కొడుకుల కోసం కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఎవరి కొడుకు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలనేది వారి తపన తాపత్రయం అంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.







