వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి స్టేడియానికి చేరుకున్న ప్రధాని మోదీ..!!

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే.

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా( India vs Australia ) జట్ల మధ్య జరుగుతున్న ఈ తుది పోరులో మొదట టీం ఇండియా బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 240 పరుగులు చేయడం జరిగింది.

ఆస్ట్రేలియాకి 241 పరుగులు టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది.ఈ క్రమంలో మ్యాచ్ వీక్షించడానికి ప్రధాని మోదీ( PM Modi ) అహ్మదాబాద్ చేరుకున్నారు.

కాసేపటి కిందటే అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ తన కాన్వాయ్ తో స్టేడియానికి బయలుదేరడం జరిగింది.ఈ మ్యాచ్ లో గెలవబోయే జట్టుకి ప్రధాని మోదీ వరల్డ్ కప్( World Cup ) బహుకరించనున్నారు.

2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ ధోని సారధ్యంలో భారత్ గెలిచింది.దీంతో ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్( India ) ఫైనల్ కి చేరుకోవడంతో.అందరూ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే జరుగుతున్న మ్యాచ్ పిచ్ బౌలర్లకు చాలా అనుకూలంగా ఉంది.దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత బ్యాట్స్ మ్యాన్ లు భారీ షాట్లు కొట్టడానికి అష్ట కష్టాలు పడ్డారు.

ఇదే సమయంలో ఆస్ట్రేలియా పటిష్టమైన ఫీల్డింగ్ కాయడం జరిగింది.ప్రస్తుతం రెండో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 13 ఓవర్లకు 70 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు