కేసీఆర్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్ర సర్కార్ అభివృద్ధికి సహకరించడం లేదని తెలిపారు.
కుటుంబం, అవినీతిని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు.
సొంత కుటుంబం ఎదిగితే చాలనుకుంటారన్న మోదీ అన్ని విషయాల్లో వారికి కుటుంబ స్వార్థమే కావాలని విమర్శించారు.
ఇలాంటి వారితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.వారసత్వ రాజకీయంతో అవినీతిని పెంచుతున్నారన్నారు.
ఈ నేపథ్యంలో అవినీతిపరులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలా.? వద్దా .? అని ప్రశ్నించారు.తనపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయన్నారు.
ఈ క్రమంలోనే కోర్టుకు వెళితే మొట్టి కాయలు పడ్డాయని ఎద్దేవా చేశారు.







