Chandrababu : చంద్రబాబు..పవన్ పై ప్రధాని మోదీ పొగడ్తలు..!!

దేశవ్యాప్తంగా ఎన్నికల నగరా మొఘటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాలలో మోదీ( Modi ) బహిరంగ సభలలో పాల్గొన్నారు.

 Pm Modi Praises Chandrababu And Pawan Kalyan-TeluguStop.com

టీడీపీ.జనసేన పార్టీలతో పొత్తు కుదిరిన అనంతరం తొలిసారి ఏపీలో చిలకలూరిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆదివారం పాల్గొన్నారు.

ఈ సభలో వచ్చే ఎన్నికలలో భారీ మెజార్టీతో కూటమికి ఓట్లు వేయాలని ప్రజలను సూచించారు.రాష్ట్ర ప్రజలకు కోసం చంద్రబాబు, పవన్ రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని పొగడటం జరిగింది.

రాష్ట్ర శ్రేయస్సు కోసం వాళ్ళిద్దరూ ఎంతగానో శ్రమిస్తున్నారు.చంద్రబాబు( Chandrababu ) రాకతో ఎన్డీఏ మరింత బలపడింది.

డబుల్ ఇంజన్ సర్కార్ తో మన లక్ష్యాలు నెరవేరుతాయి.అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలవాలి.ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ భద్రత రెండు అవసరం.ఈ రెండిటిని ఎన్డీఏ సమన్వయం చేస్తుంది.అందుకే ఏపీలో ఎన్డీఏ గెలవాలి అని మోదీ ప్రసంగించారు.ఇదిలాఉండగా టీడీపీ-బీజేపీ-జనసేన( TDP-BJP-Janasena ) “ప్రజాగళం” సభలో నిర్వహణ లోపాలు బయటపడ్డాయి.

ప్రధాని మోదీ ప్రసంగిస్తోన్న సమయంలో నాలుగైదుసార్లు మైక్ కట్టయ్యింది.పవన్ కళ్యాణ్ ప్రసంగం చేస్తున్న సమయంలో కూడా లైవ్ అస్తవ్యస్తంగా ప్రసారమైంది.

మరోవైపు పలువురు అత్యుత్సాహంతో ఎలక్ట్రిక్ పోల్స్ ఎక్కడం ఆందోళనకు గురి చేసింది.ఈ క్రమంలో మోదీ అసహనానికి గురయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube