ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉన్నాయా? అయితే వెంటనే తీసేయండి!

టెక్నాలజీ పెరుగుతున్నందుకు సంతోషించాలో.లేక బాధ పడాలో అర్ధం కావడం లేదు.

 Remove This 25 Applications In Your Phone, Google Play Stores, Applications, Wal-TeluguStop.com

ఈ టెక్నాలజీతో రోజు రోజుకు పెరగడం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.నష్టాలు అన్నే ఉన్నాయి.

ఇంకా ఈ నేపథ్యంలోనే సాఫ్ట్‌వేర్‌ సంస్థ గూగుల్‌ తన ప్లేస్టోర్‌ యాప్‌లో ఉన్న అనుమానాస్పద యాప్‌లను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వస్తోంది.

యూజర్ల డేటాను దొంగిలించే యాప్స్‌ను గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తోంది.

ఇంకా ఈ నేపథ్యంలోనే తాజాగా మరో 25 యాప్‌లను గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది.ఎందుకంటే ఈ యాప్ లు ఫేస్ బుక్ లాగిన్ వివరాలను దొంగలిస్తున్నాయట.

అందుకే ఈ యాప్ లను ప్లేస్టోర్ నుండి తొలిగించినట్టు గూగుల్ తెలిపింది.

ఈ 25 యాప్స్ లో లాగిన్ అయినా టైమ్ లో యూజర్లు ఉపయోగించే ఫేస్‌బుక్‌ లాగిన్ డేటాను రికార్డ్‌ చేస్తున్నాయి.

ఇంకా ఈ విషయాన్ని ఎవినా అనే సైబర్‌సెక్యూరిటీ సంస్థ కనిపెట్టి గూగుల్‌కు తెలిపింది.దీంతో గూగుల్ లో ప్లేస్టోర్‌ నుంచి ఆ 25 యాప్‌లను తొలగించింది.

ఇంకా యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే తొలిగించి వెంటనే పాస్ వర్డ్స్ మార్చుకోవాలని గూగుల్ సూచింది.ఆ అప్లికేషన్స్ వివరాలు ఇవే.

సూపర్‌ వాల్‌పేపర్స్‌ ఫ్లాష్‌లైట్, పాడెనటఫ్, వాల్‌పేపర్‌ లెవల్‌, కాంటర్‌ లెవల్‌ వాల్‌పేపర్‌, ఐ ప్లేయర్‌ అండ్‌ ఐవాల్‌పేపర్‌ వీడియో మేకర్‌, కలర్‌ వాల్‌పేపర్స్‌, పెడోమీటర్‌, పవర్‌ఫుల్‌ ఫ్లాష్‌లైట్‌, సూపర్‌ బ్రైట్‌ ఫ్లాష్‌లైట్‌, సూపర్‌ ఫ్లాష్‌లైట్‌, సాలిటేర్‌ గేమ్‌, యాక్యురేట్‌ స్కానింగ్‌ ఆఫ్‌ క్యూఆర్‌ కోడ్,‌ క్లాసిక్‌ కార్డ్‌ గేమ్‌, జంక్‌ ఫైల్‌ క్లీనింగ్‌, సింథటిక్‌ జడ్‌, ఫైల్‌ మేనేజర్‌, కంపోజిట్‌ జడ్‌, స్క్రీన్‌షాప్‌ క్యాప్చర్‌, డెయిలీ హోరోస్కోప్‌ వాల్‌పేపర్స్‌, వుక్సియా రీడర్‌, ప్లస్‌ వెదర్‌, యానిమ్‌ లైవ్‌ వాల్‌పేపర్‌, ఐహెల్త్‌ స్టెప్‌ కౌంటర్‌, కామ్‌.టైయాప్‌.

ఫిక్షన్.‌

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube