ఢిల్లీకి ప్లే ఆఫ్ చాన్స్ అవుట్.. చెపాక్ స్టేడియంలో ధోని సేన ఘనవిజయం..!

ఐపీఎల్ ( IPL )సీజన్ చివరి దశకు చేరుతున్న క్రమంలో ప్లే ఆఫ్( Play offs ) కోసం అన్ని జట్ల మధ్య గట్టి పోటీనే నెలకొంది.ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతూ ఏ జట్టు గెలుస్తుందో ఊహించడం కూడా కష్టమైంది.

తాజాగా ఢిల్లీ- చెన్నై( DC vs CSK ) మధ్య జరిగిన మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది.ఈ ఐపీఎల్ సీజన్లో వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిన ఢిల్లీ జట్టు, తర్వాత ఫుల్ జోష్ లో తర్వాత ఐదు మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లలో గెలిచి కమ్ బ్యాక్ ఇచ్చింది.తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్ లో బ్రేక్ పడి ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది.

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 167 పరుగులు చేసింది.దీంతో అందరూ ఢిల్లీ జట్టు టార్గెట్ సులభంగా ఫినిష్ చేసి, ప్లే ఆఫ్ రేసును ఉత్కంఠ భరితంగా మారుస్తుందని అనుకున్నారు.కానీ 140 పరుగులకే పరిమితమై 27 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఢిల్లీ జట్టు చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టు చేతులు ఓడిపోవడం వరుసగా ఇది ఏడోసారి.2011లో చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టుపై ఢిల్లీ జట్టు విజయం సాధించింది.ఆ తర్వాత చెన్నై జట్టు గెలుస్తూ వస్తుంది.

ఇక తాజాగా ఓటమి అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇంకా ఆడాల్సిన మ్యాచులు మూడే ఉన్నాయి.ఈ మూడు మ్యాచ్లలో ఢిల్లీ గెలిస్తే ప్లే ఆఫ్ చేరే అవకాశం 1 శాతం మాత్రమే.

Advertisement

లీగ్ పాయింట్ల పట్టికలో పదవ స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు నాలుగవ స్థానంలోకి రావాలంటే అనుకోని అద్భుతాలు జరగాల్సిందే.కానీ ప్లే ఆఫ్ నుంచి ఢిల్లీ జట్టు తప్పుకున్న కూడా ప్లే ఆఫ్ కు వెళ్లే జట్లను డిసైడ్ చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు