మొక్కలు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి -టియుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా

రాజన్న సిరిసిల్ల జిల్లా: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు( Telangana Union of Working Journalist )ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా ప్రజలకు పిలుపునిచ్చారు.

వేములవాడ మున్సిపల్( Vemulawada Municipal ) పరిధిలోని జర్నలిస్టుల కాలనీలో వన మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.

టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా పుట్టినరోజును పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జర్నలిస్టు కాలనీలో జర్నలిస్టులు అంతా కలిసి మొక్కలు నాటారు.

అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణ తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉందని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరం కలిసి దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.కార్యక్రమంలో పాత్రికేయులు పాల్గొన్నారు.

Advertisement
ఇంటర్ లోనే ప్రేమలో పడ్డ... ఆమె పోయాక చనిపోదాం అనుకున్న : చలపతి రావు

Latest Rajanna Sircilla News