ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో అభ్యంతరాలు సలహాలు సూచనలు పై ఈ సమావేశంలో చర్చించిన అధికారులు ప్లానింగ్ సెక్రటరీ విజయకుమార్ కామెంట్స్.జిల్లాల విభజనపై 30 రోజులపాటు అభ్యంతరాల కు గడువు ఇచ్చాం.
మార్చి 3 వరకూ అభ్యంతరాలు కలెక్టర్లకు ఇవ్వొచ్చు.ఇప్పటివరకూ వచ్చిన అభ్యంతరాలపై సమీక్ష చేస్తున్నాం.
మార్చి 10 లోపు కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుంది.
చారిత్రక,సాంస్కృతిక అంశాలతో విభజన చేపట్టాం.సహేతుకమైన కారణాలుంటే పరిగణిస్తాం.ఉద్యోగుల విభజన,మౌలిక వసతులు,జోన్ లపై చర్చిస్తున్నాం.నెల్లూరు జిల్లాలో కొంత ప్రాంతం అరకు,పాడేరు లో జోనల్ సమస్య వస్తుంది.
నాలుగు జిల్లాల నుంచి 400 వరకూ అభ్యంతరాలు వచ్చాయి.రెవిన్యూ డివిజన్ వరకూ ఇబ్బంది లేదు.ఉద్యోగులకు ఆర్డర్స్ టు సర్వ్ ఇస్తాం.కృష్ణా జిల్లాకు NTR,రంగా పేరు పెట్టాలని ఎక్కువ డిమాండ్ కు వచ్చాయి.







