ఇండియాలో పిక్సెల్ వాచ్ 2 లాంచ్.. దాని ధర, ఫీచర్లు ఇవే..

గూగుల్ కంపెనీ( Google Company ) తాజాగా తన కొత్త పిక్సెల్ వాచ్ 2ని( Pixel Watch 2 ) విడుదల చేసింది.పిక్సెల్ వాచ్ 2 ఆల్వేస్ ఆన్ ఫీచర్ తో 1.2-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో రిలీజ్ అయింది.ఇది వేర్ ఓఎస్ 4పై నడుస్తుంది.

 Pixel Watch 2 Launch In India Its Price, Features Are These, Google Pixel Watch-TeluguStop.com

క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్‌ W5 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది.ఇది హార్ట్ రేట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, స్కిన్ టెంపరేచర్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

ఇది రౌండ్ డయల్‌ను కలిగి ఉంది.కొత్త క్వాడ్-కోర్ CPU ( Quad-core CPU )ద్వారా శక్తిని పొందుతుంది.ఈ వాచ్‌ సింగిల్ చార్జ్ 5 24 అవర్స్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.ఈ స్మార్ట్ వాచ్ అనేక ఫిట్‌నెస్, స్పోర్ట్స్ ఫీచర్‌లను కూడా అందిస్తుంది.పిక్సెల్ వాచ్ 2 రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది, వాటిలో Wi-Fi, LTE వెర్షన్లు ఉన్నాయి.ఇది నాలుగు పాలిష్ సిల్వర్/బే యాక్టివ్ బ్యాండ్, షాంపైన్ గోల్డ్/హేజెల్ యాక్టివ్ బ్యాండ్, పాలిష్ సిల్వర్/పింగాణీ యాక్టివ్ బ్యాండ్, మాట్ బ్లాక్/అబ్సిడియన్ యాక్టివ్ బ్యాండ్ వంటి రంగులలో అందుబాటులో ఉంది.ఇది భారతదేశంలో రూ.39,990 నుండి ప్రారంభమవుతుంది.ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది.

30 నిమిషాల్లో 12 గంటల ఛార్జ్ లభిస్తుంది.కొత్త వాచ్ లో గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ అసిస్టెంట్, Pixel సెక్యూరిటీ ఫీచర్‌లకు ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయి.ఇది 32 GB eMMC ఫ్లాష్, 2GB SDRAM తో వస్తుంది.

ఇది దుమ్ము, ధూళి, నీటిని తట్టుకొని పనిచేయగలదు.హెల్త్ ట్రాక్ చేసుకోవాలనుకునే వారికి ఈ స్మార్ట్ వాచ్ బాగా ఉపయోగపడుతుంది.

చాలా ఖచ్చితమైన రిజల్ట్స్ అందించడంలో ఈ వాచ్ ముందుంటుంది.ధర కాస్త ఎక్కువే అయినా హెల్త్ ఫ్యూచర్లు బాగుంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube