టిడిపి కార్యకర్తలు కర్రలు, బండరాళ్లతో దాడి చేయటం వల్ల మా పార్టీ చెందిన ముగ్గురు బీసీ కార్యకర్తలు ఇప్పుడు కూడా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు.నేను నా కుటుంబ సభ్యులు మాచర్లలోనే నివాసం ఉంటాము.
నేను నా రాజకీయం వ్యవహారాలు మాచర్ల నుంచి చేస్తాను.స్థానిక ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గంలో తిరగటం నాకు హక్కు.
ప్రశాంతంగా ఉన్న మాచర్లను టీడీపీ రాజకీయ లబ్దికోసం ఎక్కడో గుంటూరు,ఇతర ప్రాంతాల నుంచి టిడిపి నాయకులను ప్రోత్సహించి “చలో మాచర్ల” అని పిలుపునిచ్చి ఇక్కడ ప్రజలను భయభ్రాంతులు చేయాలని ప్రయత్నిస్తున్నారు…వైసీపీ కార్యకర్తలపై దాడి చేసిన టిడిపి కార్యకర్తలకు.గుంటూరు టిడిపి నేతలే ముద్దాయిలకు ఆశ్రయం కల్పించింది వాస్తవం కాదా