మహిళలకు మోదీ కుట్టు మెషిన్లు ఉచితంగా పంపిణీ.. ఇందులో నిజమెంత...

ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.అయితే వారికోసం ఫ్రీగా కుట్టు మెషిన్లను కూడా ఆయన అందజేసే కొత్త పథకం తీసుకొచ్చారని ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫేక్ మెసేజ్ చక్కర్లు కొడుతోంది.

 Pib Fact Check On Modi Govt Giving Free Sewing Machines To Women,pib Fact Check,-TeluguStop.com

అయితే దీనిని నమ్మి ఆ మెసేజ్ లోని లింక్ క్లిక్ చేసి వ్యక్తిగత సమాచారం అందిస్తే నిండా మోసపోవడం ఖాయం.

స్కామర్లు( Scammers ) భారతదేశంలోని సామాన్య మహిళల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించడం కోసం హానికరమైన లింక్‌ను ఆ మెసేజ్ లో పంపిస్తున్నారు.వారు ఈ సమాచారాన్ని ఐడెంటిటీ థెఫ్ట్( Identity Theft ) లేదా డబ్బును దొంగిలించడానికి ఉపయోగించవచ్చు.ఈ ఫేక్ మెసేజ్ టైటిల్ ను వారు చాలా టెంప్ట్ చేసేలా పెడుతున్నారు.

ఉచితంగా కుట్టు మెషిన్లను ఇప్పుడే పొందేయండి అంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు.దీనివల్ల మహిళలు, అమ్మాయిలు మరో ఆలోచన లేకుండా దీనిపై క్లిక్ చేస్తే ప్రమాదం ఉంది.
నిజానికి మహిళలకు ఉచితంగా కుట్టు మెషిన్లను( Free Sewing Machines ) అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని ప్రకటించలేదు.ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇదొక నకిలీ సందేశం అని స్పష్టత ఇచ్చింది.

సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులర్ ఈ మెసేజ్ ఫేక్ కాబట్టి దానిని ఎవరూ కూడా తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయరాదు.అలాంటి సందేశాన్ని స్వీకరించినట్లయితే, మీరు దానిని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్‌ చెక్ డిపార్ట్‌మెంట్ కు పంపడం ద్వారా అది నిజమో కాదు వెరిఫై చేసుకోవచ్చు.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫాక్ట్ చెక్( Fact Check ) అనేది ప్రజలకు వాస్తవ తనిఖీ సేవలను అందించే ప్రభుత్వ చొరవ.మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫాక్ట్ చెక్ వెబ్‌సైట్, వాట్సాప్ నంబర్ లేదా ఈమెయిల్ చిరునామాకు మెసేజ్ పంపవచ్చు.ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫాక్ట్ చెక్ మెసేజ్‌ని పరిశోధిస్తుంది.అది నిజమో అబద్ధమో మీకు తెలియజేస్తుంది.నకిలీ వార్తల గురించి తెలుసుకోవడం.అందుకున్న సమాచారాన్ని ధృవీకరించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.

అలా చేయడం ద్వారా, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో మీరు సహాయపడగలరు.అంతేకాకుండా హ్యాకర్ల( Hackers ) బారిన పడకుండా, డబ్బులు కోల్పోకుండా జాగ్రత్త పడొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube