ఫోన్ పే వినియోగదారులూ! ఈ విషయం గమనించారా?

ప్రస్తుతం ఫోన్ పే లేని ఒక స్మార్ట్ ఫోన్(Smart phone) ఇక్కడ దాదాపు ఉండనే ఉండదని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.యూపీఐ ట్రాన్సాక్షన్‌(UPI transaction) చేసిన ప్రతి ఒక్కరికీ ఫోన్‌పే గురించి తెలుసు.

 Phone Pay Users! Notice This , Phonepay, New Features, New Record, Technology Ne-TeluguStop.com

ఇప్పుడీ డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫాం సరికొత్త మైలురాయిని చేరుకుందని సమాచారం.విషయం ఏమంటే ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా జరిగే వార్షిక పేమెంట్ల విలువ 1 ట్రిలియన్‌ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.84 లక్షల కోట్లుకి చేరుకుందని ఆ కంపెనీ తాజాగా ప్రకటించింది.యూపీఐ లావాదేవీల కారణంగానే ఈ స్పెషల్ ఫీట్ ను అందుకోగలిగినట్లు ఫోన్ పే ఈ సందర్బంగా పేర్కొంది.

ఈ నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం మాట్లాడుతూ… యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో 50 శాతానికి పైగా మార్కెట్‌ వాటా కలిగి ఉన్నామని, రాబోయే రోజుల్లో యూపీఐ లైట్‌, యూపీఐ ఇంటర్నేషనల్‌, క్రెడిట్‌ ఆన్‌ యూపీఐ వంటి సేవల ద్వారా మరింత వేగంగా రాణించేందుకు కృషి చేస్తామని, ఖచ్చితంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తామని ఫోన్‌పే కన్జ్యూమర్‌ బిజినెస్‌ హెడ్‌ అయినటువంటి సోనికా చంద్ర(Sonika Chandra) తెలిపారు.ఆర్‌బీఐ నుంచి పేమెంట్‌ అగ్రిగేటర్‌ లైసెన్స్‌ సైతం పొందినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇకపోతే విదేశాల్లోని భారతీయులు(Indians) సైతం ఇకనుండి యూపీఐ ద్వారా స్థానికంగా నగదు చెల్లింపులు చేయొచ్చు.ఈ మేరకు ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే యూఏఈ, మారిషస్‌, నేపాల్‌, సింగపూర్‌, భూటాన్‌ దేశాల్లో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు భోగట్టా.దీంతో అంతర్జాతీయంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి ఫిన్‌టెక్‌ సంస్థగా ఫోన్‌పే రికార్డులు క్రియేట్ చేసింది.ఇకపై భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు నగదు మార్పిడి చేయాల్సిన అవసరం లేకుండా తమ భారతీయ బ్యాంకు ఖాతా ద్వారానే నగదు చెల్లింపులు చేయొచ్చన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube