యూకేలో( UK ) విషాదం చోటు చేసుకుంది.గత వారం లండన్‌లో( London ) జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్ధిని దుర్మరణం పాలైంది.
నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్( NITI Aayog CEO Amitabh Kant ) సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం.లండన్‌లో తన అపార్ట్‌మెంట్‌కు తిరిగి వెళ్తుండగా ట్రక్కు ఢీకొని ఆమె ప్రాణాలు కోల్పోయింది.33 ఏళ్ల చీస్తా కొచ్చర్( Cheistha Kochar ) లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో (ఎల్‌ఎస్ఈ) పీహెచ్‌డీ అభ్యసిస్తున్నారు.ఆమె తండ్రి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ . గతంలో పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ నీతి అయోగ్‌తో కలిసి పనిచేసిన చీస్తా కొచ్చర్ .ఎల్ఎస్ఈ నుంచి బిహేవియరల్ సైన్స్‌లో పీహెచ్‌డీ అభ్యస్ధిస్తున్నారు.నీతి ఆయోగ్‌లోని లైఫ్ ప్రోగ్రామ్‌లో చీస్తా కొచ్చర్ తనతో కలిసి పనిచేశారని అమితాబ్ కాంత్ తన ఎక్స్ పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.లండన్‌లో సైక్లింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని.
కానీ ఆమె ఇంత త్వరగా లోకాన్ని విడిచి వెళ్లిపోతారని అనుకోలేదని ఆయన పేర్కొన్నారు.

లెఫ్టినెంట్ జనరల్ కొచ్చర్ (రిటైర్డ్ ) తన కుమార్తె భౌతికకాయన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు లండన్‌లో ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు.మార్చి 19న సైక్లింగ్ చేస్తుండగా ఆమెను ట్రక్కు( Truck ) ఢీకొట్టిందని ఆయన తెలిపారు.చీస్తా గతేడాది సెప్టెంబర్ నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో( London School of Economics ) చదువుకుంటున్నారు.
దీనికి ముందు ఆమె జూన్ 2021 నుంచి ఏప్రిల్ 2023 వరకు నేషనల్ బిహేవియరల్ ఇన్‌సైట్స్ యూనిట్ ఆఫ్ ఇండియా.నీతి ఆయోగ్‌లో సీనియర్ అడ్వైజర్‌గా పనిచేశారు.
అంతకుముందు సెంటర్ ఫర్ సోషల్ అండ్ బిహేవియర్ చేంజ్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు.ఆమె ఢిల్లీ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీ, చికాగో యూనివర్సిటీలలో చదువుకున్నారు.

కాగా.గత వారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ యువతి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.మృతురాలిని అర్షియా జోషిగా గుర్తించారు.మార్చి 21న పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగినట్లు న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శనివారం ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ.
ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.అర్షియా జోషి గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.జోషి కుటుంబంతో, స్థానిక ఇండియన్ కమ్యూనిటీతో టచ్‌లో వున్నామని కాన్సులేట్ కార్యాలయం తెలిపింది.అర్షియా జోషి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నామని కాన్సులేట్ కార్యాలయం వెల్లడించింది.