రికార్డు స్థాయికి 'పెట్రో' ధరలు

దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి.శుక్రవారం లీటరుపై 25 పైసలు, 30 పైసలు చొప్పున పెరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశాలలో వాటి ధర వంద రూపాయలు దాటేసింది.దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర అత్యధికంగా లీటరు రూ.101.89కు, ముంబైలో రూ.107.95కు చేరినట్లు ప్రభుత్వరంగ చమురు ధరల నోటిఫికేషన్ పేర్కొంది.డీజిల్ ధర కూడా మునుపెన్నడూ లేనంతగా ఢిల్లీలో రూ.90.17 ముంబైలో రూ.97.84కు చేరింది.అయితే రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య ధరలు స్థానిక పనులపై ఆధారపడి ఉంటాయి.ఈ వారంలో ధరలు మూడవసారి పెంచడం ద్వారా దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర రూ.100ను దాటేసింది.

 'petro' Prices To Record Levels,latest News,hindhusthan Petrolium-TeluguStop.com
Telugu Petro Levels, Latest, Petrol Deisel-Latest News - Telugu

అదేవిధంగా గత ఎనిమిది రోజుల్లో ఆరు సర్లు ధరలు పెరగడం ద్వారా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో అనేక నగరాలలో డీజిల్ ధర రూ.100కు పైబడే ఉంది.దేశంలోనే పెట్రో ఉత్పత్తుల కు సంబంధించి అత్యధిక ధర కలిగి ఉన్న రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో పెట్రోల్ ధర రూ.113.73 కాగా డీజిల్ రూ.103.9గా ఉంది.అంతర్జాతీయ ముడిచమురు ధరలు మూడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్న తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్) సెప్టెంబర్ 24 తర్వాత నుంచి రోజువారి ధరల మార్పును పునరుద్ధరించాయి.సెప్టెంబర్ 24 నాటి నుంచి ఆరు సర్లు ధరలు పెరగడంతో డీజిల్ ధర లీటర్ కు రూ.1.55 పైసలు పెరిగింది.వారంలో మూడు సార్లు పెరుగుదలతో పెట్రోల్ లీటర్ కు 75 పైసలు పెరుగుదల జరిగింది.అంతకుముందు మే 4 జూలై 17 మధ్య పెట్రోల్ ధర లీటర్ కు రూ 11.44కు, డీజిల్ ధర లీటర్ కు రూ.9.14కు పెరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube