విశాఖ మర్రిపాలెంలో ఓ వ్యక్తి పాముకు స్నానం చేయించాడు.అదేంటి పాముకు స్నానం ఏంటి అనుకుంటున్నారా.
మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో పాము కనిపించడంతో స్థానికులు పాములు పట్టే కిరణ్ కుమార్ కు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్నాడు.
బురదలో పాము అటూ ఇటూ తిరుగుతుండడాన్ని పసిగట్టి కిరణ్ వెంటనే దాన్ని చాకచక్యంగా పట్టుకున్నాడు.
అనంతరం దానికి స్నానం చేయించి, ఆహారం పెట్టి అటవీశాఖ అధికారులకు అప్పగించాడు.