తాబేలేమిటి.మెరుపు వేగంతో పరుగులు పెట్టడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమండీ.మనం మన చిన్ననాటినుండే చదువుకుంటున్నాం.ఎన్నో పుస్తకాలలో తాబేలు-కుందేలు పరుగు పందెం గురించి.తాబేలు బేసిగ్గా ఎంతో నెమ్మదిగా వెళ్తుంది అని ఆ కథలో రాసి ఉంటుంది.అయితే అదే నిజం కూడాను.
అయితే ఆ కథ చదివినప్పటి నుండి కూడా తాబేలు ఈ భూమి మీద నెమ్మదిగా ప్రయాణించే ఓ జీవిగానే మనకు తెలుసు.అయితే అదంతా నిజం కాదండోయ్.
అవును.ఇక్కడ వీడియో చూస్తే మీరే చెబుతారు.
ఆ కథ ఓ కట్టుకథ అని.
అవును.తాబేలు అంటే నెమ్మదిగా నడిచే జీవిగానే అందరికీ తెలుసు.కానీ ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం ఇప్పుడు వరకు మనం విన్న కథలను పటాపంచలు చేసేస్తుంది అని చెప్పాలి.
ఏకంగా పరుగుల రారాజు హుస్సేన్ బోల్ట్ కి ఛాలెంజ్ విసిరేలాగే ఇక్కడ ఒక తాబేలు ఎంతో వేగంగా పరుగులు పెట్టింది.ఇది చూసిన వారు ప్రతి ఒక్కరు అవాక్కైపోతున్నారు.
కావాలంటే మీరు కూడా చూడండి.ఆ తాబేలు యెంత చురుగ్గా పరుగెడుతూ దగ్గర్లో వున్న చెరువులోకి ఎలా వెళ్లిపోతుందో.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా తాబేలు ఇంత వేగంగా పరిగెత్తడం ఏంటి? ఇది నిజమేనా? అని నోళ్లెళ్లబెడుతున్నారు.ఈ వీడియోలో తాబేలు అప్పటి వరకు అందరికీ తెలిసిన విధంగా ఎంతో నెమ్మదిగా నడిచింది.అంతలోనే టాప్ గేర్ అందుకుంది.మెరుపు వేగంతో పరుగులు తీసి సెకన్ల వ్యవధిలో నీటిలోకి దూకి అదృశ్యం అయింది.అయితే ఈ తాబేలు వేగంగా కదిలిన తీరు చూసి వీడియో తీసిన వ్యక్తి సైతం అవాక్కయ్యాడు.ఇప్పుడు ఆ వ్యక్తి వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు అని చెప్పాలి.







