పెన్షన్ల విషయంలో చంద్రబాబుపై పేర్ని నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.ప్రస్తుతం ఏపీలో రాజకీయం( AP Politics ) మొత్తం పెన్షన్ పంపిణీ చుట్టూ తిరుగుతూ ఉంది.

విషయంలోకి వెళ్తే ఎలక్షన్ కమిషన్ పెన్షన్ల పంపిణీ విషయంలో వాలంటీర్ల జోక్యం ఉండకూడదని ఆదేశించడం జరిగింది.ఈ క్రమంలో చంద్రబాబు పెన్షన్( Pensions ) లను అడ్డుకున్నారని వైసీపీ నాయకులు( YCP Leaders ) విమర్శలు చేస్తున్నారు.

ఇదే రకంగా మాజీమంత్రి పేర్ని నాని ఈ పెన్షన్ల విషయంలో చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు మాట మార్చే నేర్పరి అని విమర్శించారు.

Advertisement
Perni Nani Serious Comments On Chandrababu Regarding Pensions, Perni Nani, Chand

బాబు తన మాటలతో ఎరవేస్తారని.అవసరం తీరాక పాతర వేస్తారని మండిపడ్డారు.

Perni Nani Serious Comments On Chandrababu Regarding Pensions, Perni Nani, Chand

రాజకీయ స్వార్థం కోసం పెన్షనర్ల పొట్ట కొట్టారని సీరియస్ కామెంట్స్ చేశారు.వాలంటీర్లు వద్దు అని ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరని ప్రశ్నించారు.వాలంటీర్లు వద్దని ఎలక్షన్ కమిషన్( Election Commission ) కి లేఖలు రాసింది తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కాదా అని ప్రశ్నించారు.

పురందేశ్వరి, నిమ్మగడ్డ ప్రసాద్( Nimmagadda Prasad ) ఎవరో జనాలకు తెలియదా అని నిలదీశారు.గతంలో ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు నిమ్మగడ్డ వేసిన వేషాలు ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.

ఆయనకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో కూడా తెలుసన్నారు.చంద్రబాబు పేదలను ఓటు బ్యాంకు గానే చూశారని ఆయన కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.

మొటిమల తాలూకు మచ్చలు పోవడం లేదా? అయితే చియా సీడ్స్ తో ఇలా చేయండి!

ఇప్పుడు ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో చంద్రబాబు మాట మారుస్తున్నారు అని పేర్ని నాని మండిపడ్డారు.వృద్ధులు, వితంతువుల ఉసురు పోసుకుని చంద్రబాబు( Chandrababu ) బాగుపడతారా అని ఫైర్ అయ్యారు.

Advertisement

సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.విషపు కూటమి అంటూ పేర్ని నాని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు