తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్న విషయం తెల్సిందే.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పలు డిమాండర్లను నెరవేర్చే వరకు తాము సమ్మెను కొనసాగిస్తామంటూ ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు.
మరో వైపు ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఇటీవల మీడియాతో మాట్లాడిన సందర్బంగా కేసీఆర్ ఏపీలో ఆర్టీసీ విలీనంను తప్పుబట్టారు.
ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా ఆర్టీసీ వల్ల ప్రభుత్వంకు దెబ్బ పడుతుందని అన్నారు.ప్రభుత్వం ఉన్న ఆర్ధిక సమస్యల నేపథ్యంలో ఆర్టీసీని ప్రభుత్వం హ్యాండవర్ చేసుకోవడం అనేది చాలా పెద్ద తప్పుడు నిర్ణయంగా కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏపీలో ఆర్టీసీ విలీన పక్రియ ఇంకా కాలేదు అవుతుందో లేదో కూడా తెలియదు అన్నాడు.
కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్నినాని స్పందించాడు.
కేసీఆర్ వ్యాఖ్యలను తాము పాజిటివ్‌గా స్వీకరిస్తున్నాం.ఆయన అన్నట్లుగా ఆర్టీసీని విలీనం చేయడం వల్ల సమస్యల వస్తాయని తాము భావించడం లేదు.
ఖచ్చితంగా సంస్థ బాగుపడుతుందని ఆశిస్తున్నాం.ఇక మూడు నెలల్లో ఆర్టీసీ విలీన పక్రియ పూర్తి చేస్తామంటూ ఈ సందర్బంగా పేర్ని నాని వ్యాఖ్యలు చేశాడు.
ఒక పెద్ద కార్పోరేషన్‌ను ఇలా స్వాదీనం చేసుకుని పూర్తిగా ప్రభుత్వపరం చేయడం చాలా పెద్ద విషయం అని, జగన్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి అన్నారు.ఏపీలో విలీనం చేయడం వల్లే తెలంగాణలో కూడా విలీనం కోసం డిమాండ్లు మొదలయ్యాయి.







