షుగ‌ర్ ఉన్న వారు పాల‌ను ఇలా తీసుకుంటే చాలా మంచిద‌ట‌!

పాలు.చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అంద‌రికీ మేలు చేసే సంపూర్ణ పోష‌కాహారం.

ఆరోగ్యాన్ని పెంపొందించ‌డ‌మే కాదు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా అడ్డు క‌ట్ట వేయ‌డంలోనూ పాలు అద్భుతంగా స‌హాయ‌ ప‌డ‌తాయి.కాల్షియం, పొటాషియం, జింక్‌, విట‌మిన్ డి, విటిమ‌న్ ఎ, నియాసిన్‌, ఫోలిక్ యాసిడ్‌, ప్రోటీన్‌తో పాటు శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పాల‌ల్లో పుష్క‌లంగా ఉంటాయి.

అందుకే రోజుకు ఒక గ్లాస్ పాల‌ను ఖ‌చ్చితంగా తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అయితే షుగ‌ర్ వ్యాధి ఉన్న వారు మాత్రం పాల‌ను డైరెక్ట్‌గా కాకుండా ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే చాలా మంచిది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లి పోదాం ప‌దండీ.మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు గ్లాస్ పాల‌కు పావు స్పూన్‌ దాల్చిన చెక్క పొడిని క‌లిపి తీసుకుంటే ఎంతో మేలు.

Advertisement

పాల‌కు దాల్చిన చెక్క పొడిని కాలిపి ప్ర‌తి రోజు తీసుకోవ‌డం వ‌ల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని ప‌లు అధ్యయనాల్లో తేలింది.అంతేకాదు, రోగ నిరోధక వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.

నిద్ర లేమి దూరం అవుతుంది.మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.

అలాగే షుగ‌ర్ వ్యాధి ఉన్న వారికి ఏదైనా గాయాలైతే.త్వ‌ర‌గా మాన‌వు.అయితే అలాంట‌ప్పుడు ప‌సుపు పాలను త‌ప్ప‌కుండా తాగాల్సిందే.

పాల‌ను నేరుగా కాకుండా కొద్దిగా ప‌సుపు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల‌.అందులో ఉండే కర్క్యుమిన్ అనే కాంపౌండ్ గాయాల‌ను స్పీడ్‌గా హీల్ అయ్యేలా చేస్తాయి.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

అంతే కాదండోయ్‌.మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు ప‌సుపు పాలు తాగితే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

Advertisement

కీళ్ల నొప్పులు ద‌రి చేర‌వు.మ‌రియు కాలేయం ఆరోగ్య వంతంగా మారుతుంది.

తాజా వార్తలు