గిరిజన మహిళపై దాడి చేస్తే సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు.ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు.
ఈ మేరకు బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు సినిమా చూపిస్తారని చెప్పారు.
కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసిగెత్తి ఉన్నారని తెలిపారు.మళ్లీ మళ్లీ కేసీఆర్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఈ నేపథ్యంలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు.