కళ్ళజోడు పెట్టుకుంటే కరోనా సోకదు.. ఇదిగో ప్రూఫ్!

ఇప్పటికే తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ తాజాగా మరింత తీవ్రమైన వేగంతో దూసుకువస్తుంది.

గత ఏడాది నుండి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కరోనా వైరస్ కు ఇటీవలే వ్యాక్సిన్ రాగా అది పూర్తి స్థాయిలో ప్రజలకు అందక ముందే ఇప్పుడు మరింత వేగంగా దూసుకొస్తోంది.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో, పలు ప్రాంతాలలో వైరస్ కేసులు ఎక్కువవడంతో వైద్య నిపుణులు ఎన్నో జాగ్రత్తలు తెలుపుతున్నారు.ఇదిలా ఉంటే కళ్ళజోడు ధరించే వారి గురించి వైద్య నిపుణులు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

ఇదివరకే కరోనా వైరస్ అనేక రకాల లక్షణాలతో వెలువడిన సంగతి తెలిసిందే.దూరాన్ని పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోమని వైద్యులు ఎన్నో సలహాలు ఇస్తూనే ఉన్నారు.

కానీ వాటిని పూర్తిగా దూరం పెడుతూ మళ్లీ కొని తెచ్చుకున్నారు.అంతేకాకుండా కళ్ళు, చెవులు, నోరు, ముక్కు చేతిలో తాకరాదని సలహాలు ఇస్తూనే ఉన్నారు.

Advertisement

కానీ వాటిని పట్టించుకోకుండా అజాగ్రత్తగా ఉండగా తాజాగా వైద్య నిపుణులు కళ్ళద్దాలు ధరించే వారికి కరోనా సోకే అవకాశం తక్కువ ఉందని తెలిపారు.

భారతీయ పరిశోధకుల తెలిపిన అధ్యయన ప్రకారం కళ్ల ద్వారా వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుందని తెలుపగా అందులో కళ్లజోడు ధరించిన వాళ్లను పరిశీలించారు.ఓ ఆస్పత్రిలో 223 మంది పురుషులు, 81 మంది స్త్రీల పై రెండు వారాల పాటు పరిశోధన నిర్వహించారు.రోజుకు ఎక్కువ సమయం కళ్ళద్దాలు ధరించేవారు తమ కళ్ళ వద్దకు చేతులను తక్కువగా తాకే అవకాశం ఉంటుంది కాబట్టి సోకే అవకాశం తక్కువగా ఉంటుందట.

తమ అధ్యయనంలో పాల్గొన్న వారు 23 సార్లు ముఖాన్ని, 3 సార్లు కళ్ళకు సహకారాన్ని వెల్లడించారు. దీంతో 19 శాతం మంది రోజు మొత్తంలో ఎక్కువ సమయం ధరించారని తెలిపారు.

దాంతో వారికి వైరస్ సోకే అవకాశాలు రెండు నుంచి మూడు రెట్లు తక్కువగా ఉందని తెలిపారు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు