తైవాన్ పైన కన్నేసిన చైనా అలా ప్రకటించడంతో ప్రజలు వణికిపోయారు.. అసలు సంగతి ఇదే?

ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం ప్రకటించిన తరువాత ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.దేశాల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారే తప్ప, ఈ మోడ్రన్ కాలంలో యుద్ధం అంటే దాదాపుగా అవాయిడ్ చేస్తారు దేశాధినేతలు.

 People Were Shocked When China Announced That It Was Looking For Taiwan , Taiwan-TeluguStop.com

దీనికోసమే మనకు ఐక్యరాజ్యసమతి వంటి సంస్థలు కూడా ఉన్నాయి.అయితే ఇలాంటి సంస్థలు, ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తూ పుతిన్.

.ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి చొచ్చుకెళ్లాలంటూ సైనికులకు ఆదేశాలు ఇచ్చాడు.

దీని వల్ల ప్రపంచంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? భవిష్యత్తులో ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? అని రాజకీయ ఉద్ధండులు సమీక్షిస్తుండగానే ఓ సంఘటన జరిగింది.

తాజాగా తైవాన్ పై దాడి చేసినట్లు చైనాలో ఓ టీవీ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేసింది.

ఈ క్రమంలో తైవాన్ యుద్ధ నౌకలపై చైనా క్షిపణులు దాడి చేశాయని, తైవాన్ అధ్యక్షురాలు అత్యవసర పరిస్థితి ప్రకటించారంటూ పేర్కొంది.దీంతో తైవాన్ ప్రజలు వణికిపోయారు.దాని తర్వాత సర్దుకొని అదే వార్తా సంస్థ తాను చేసిన ఘోర తప్పిదాన్ని గుర్తించి తైవాన్ ప్రజలు భయపడొద్దంటూ ప్రజలను బుజ్జగించింది.అగ్నిమాపక శాఖతో చేసిన డ్రిల్ను ఉద్దేశించి చేసిన హెచ్చరికలని, సాంకేతికలోపం కారణంగా అవి టీవీలో ప్రసారమయ్యాయి అంటూ న్యూస్ యాంకర్ వివరణ ఇచ్చారు.

Telugu China, Taiwan, Puthin, Urikrane-Latest News - Telugu

ఇకపోతే, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అందరి చూపు చైనా పక్కన ఉన్న తైవాన్ పై పడింది.స్వయం పాలనలో ఉన్న తైవాను తమలో విలీనం చేసుకుంటామని చైనా ప్రకటించిన సంగతి తెలిసినదే.ఈ క్రమంలో జరిగిన ఈ సంఘటనతో తైవాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యింది.ఇక తైవాన్ సమీపంలో కి యుద్ధ నౌకలు, యుద్ధవిమానాలు పంపుతూ చైనా భయాందోళనలు సృష్టించడం మనం చూస్తూ వున్నాం.

ఈ నేపధ్యం ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం.ఏదిఏమైనా తైవాన్ ని చైనా ఆక్రమిస్తుందని ఓ వర్గంవారు అంటున్నారు.అందులో ప్లాన్ ప్రకారమే ఇలాంటి వార్తలు చైనా ప్రకటిస్తుందని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube