ఫస్ట్ వచ్చిన ఏపీలో రాని పెన్షన్లు.. చంద్రబాబుపై ప్రజల ఫైర్

ఏపీలో పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో గత మూడు రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ( Pensions Distribution ) వద్దని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) అంటున్నారు.

 Pensions Not Coming In Ap Which Came First People Fire On Chandrababu Details, P-TeluguStop.com

వాలంటీర్లను వినియోగించుకుని వైసీపీ( YCP ) గెలవాలని చూస్తోందంటూ కీలక ఆరోపణలు చేస్తున్నారు.అంతేకాదు పెన్షన్లను వాలంటీర్లు( Volunteers ) ఇవ్వకుండా చంద్రబాబు సంకెళ్లు వేశారంటూ ఏపీ ప్రజలు భావిస్తున్నారని తెలుస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతినెల ఇంటి గడప ముందుకు వచ్చి వాలంటీర్ల తాతాఅవ్వలకు పెన్షన్లను అందించేవారు.ఈ సారి ఫస్ట్ వచ్చింది.కానీ గుమ్మం ముందు నిలబడి తాతా, అవ్వా, అక్కా పెన్షన్ తీసుకోండి అనే వాలంటీర్ మాత్రం రాలేదు.దీనికి కారణం ప్రతిపక్షాలు చేసిన కుట్ర రాజకీయాలనే ప్రజలు మండిపడుతున్నారు.

వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని విపక్షాలు పిటిషన్ వేయడంతో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది.విపక్షాల కుట్రలకు ఫించన్ దారులు బలవుతున్నారు.

మొదటి తారఖున రావాల్సిన పెన్షన్ డబ్బులు వారికి అందలేదు.చంద్రబాబు ఒక్క దురాలోచన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవ్వాతాతలకు ఆసరాకు గండి కొట్టింది.

Telugu Ap, April, Chandrababu, Cmjagan, Volunteers-Latest News - Telugu

మండే ఎండలో అవ్వాతాతలతో పాటు వికలాంగులు సైతం సచివాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది.ఇదొక్కటే కాదు రేషన్ సరుకులు( Ration ) కూడా ఇళ్ల దగ్గర ఇవ్వొద్దని అడ్డుకోవడంతో బియ్యం కోసం సైతం ప్రజలు రేషన్ డిపోల వద్ద గుమిగూడుతున్నారు.నిన్నటివరకు గుమ్మం ముందుకు పెన్షన్లు, బియ్యం, సరుకులు వచ్చేవని.చంద్రబాబు చేసిన కుట్ర కారణంగా ఇబ్బంది పడుతున్నామంటూ ఏపీ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ap, April, Chandrababu, Cmjagan, Volunteers-Latest News - Telugu

ఇప్పుడే ప్రజలను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు అధికారం వస్తే రాష్ట్రమంతా అల్లాడుతుందని భావిస్తున్నారని తెలస్తోంది.ఈ క్రమంలోనే తమ బిడ్డలా ఇంటి వద్దకే పెన్షన్లు, వైద్యం ఇలా సేవలు అందించిన వైఎస్ జగన్ కే( YS Jagan ) మరోసారి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారట.ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని మంచి చేసిన వైసీపీకే మళ్లీ అధికార పగ్గాలు అందించాలని ఏపీ ప్రజలు భావిస్తున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube