అప్పుడే పెంచేసిన రీతు వర్మ..!

ఓ సినిమా హిట్ కొడితే ముందు తారామణులంతా ఆ క్రేజ్ తో వచ్చిన అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు.

ప్రస్తుతం అదే క్రమంలో రీసెంట్ గా పెళ్లిచూపులు సినిమా హీరోయిన్ రీతు వర్మ కూడా దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తూ పారితోషకం పెంచి చుక్కలు చూపిస్తుందట.

అంతకుముందు రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేసినా రాని క్రేజ్ పెళ్లిచూపులుతో వచ్చేసరికి అమ్మడు ఎవరి మాట వినట్లేదట.అంతేకాదు పెళ్లిచూపులు ముందు కమిట్ అయిన దర్శక నిర్మాతలకు తాను అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అంటూ పట్టుపడుతుందట.

కొందరేమో ఆమె డిమాండ్ చేసినంత ఇచ్చేందుకు రెడీగా ఉంటే మరికొందరేమో ఆమెతో ఈ విషయంపై గొడవకు దిగుతున్నారట.ఇక అడివి శెష్ తో చేయాల్సిన సినిమాను కూడా ఇప్పుడు చేయనని చెప్పేస్తుందట.

మరి ఒక్క హిట్ కే అమ్మడు ఇలా మారిపోతే మరి తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని అందరు అనుకుంటున్నారు.

Advertisement
ఫ్లాప్ అయ్యే సినిమాకు వన్ మోర్ ఎందుకన్న బాలయ్య..

తాజా వార్తలు