టాలీవుడ్ క్రేజీ లవ్ కపుల్స్ చైతన్య సమంతల లవ్ అందరికి తెలిసిందే.మొన్నటిదాకా హాట్ హాట్ గా నడిచిన ఈ న్యూస్ ఈ మధ్య చల్లబడ్డదని అనుకునేలోపే తాజాగా అక్కినేని ఫ్యామిలీతో సమంత దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చింది.
నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు వెడ్డింగ్ ఈవెంట్ లో అక్కినేని ఫ్యామిలీతో కలిసి వచ్చిన సమంతను చూసి అక్కినేని కోడలుగా ఫిక్స్ అవుతున్నారు.ఇప్పటికే కింగ్ నాగార్జున తన కొడుకుల పెళ్లి విషయంలో తనకెలాంటి అభ్యంతరాలు లేవని తేల్చి చెప్పేశాడు.
పైకి మాత్రం లేదు కాదు అని చెప్పుకొస్తున్న చైతు, సమంతలు లోపల మాత్రం చాలా దూరం వెళ్లారట.ఇప్పుడు ఏకంగా ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు అక్కినేని కుటుబంతో వెళ్లిదంటే ఇక ఇద్దరి పెళ్లి మాత్రమే లేట్ అనేస్తున్నారు.
మరి ఆ పెళ్లి ఏదో చేసుకుంటే ఇక ఎవరికి మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు.చైతు, సమంతల మ్యారేజ్ ఇన్విటేషన్ కోసం అటు అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని జనాలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ ఈవెంట్ లో అఖిల్ కూడా తన గాళ్ ఫ్రెండ్ శ్రీయా భూపాల్ తో కలిసి దిగిన పిక్స్ సోషల్ సైట్స్ లో వైరల్ గా పాకుతున్నాయి.