ఈ ఒక్క ఆకుతో ముఖంపై ఎలాంటి మ‌చ్చ‌లనైనా పోగొట్టుకోవ‌చ్చు..తెలుసా?

ముఖంపై ఒక్కోసారి న‌ల్ల‌టి లేదా గోధుమ రంగు మ‌చ్చ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి.

మొటిమ‌లు, కాలుష్యం, హార్మోన్ ఛేంజ‌స్‌, వ‌య‌సు పైబ‌డ‌టం వంటి కార‌ణాల వ‌ల్ల చ‌ర్మంపై మ‌చ్చ‌లు ప‌డుతూ ఉంటాయి.

దాంతో ముఖం ఎంత అందంగా ఉన్నా.అందవిహీనంగా క‌నిపిస్తుంది.

అందుకే ఆ మ‌చ్చ‌ల‌ను వ‌దిలించుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఏవేవో క్రీములు వాడుతుంటారు.

ఎన్నెన్నో ఫేస్ ప్యాకులు వేసుకుంటారు.అయిన‌ప్ప‌టికీ మ‌చ్చ‌లు త‌గ్గ‌కుంటే మాన‌సికంగా కృంగిపోతుంటారు.

Advertisement
Peepal Leaves Help To Reduce Black Spots On Face! Peepal Leaves, Peepal Tree, Pe

అయితే ఇక‌పై చింతించకండి.ఎందుకంటే, చ‌ర్మంపై ఏర్ప‌డిన‌ ఎలాంటి మ‌చ్చ‌ల‌నైనా రావి ఆకుతో పోగొట్టుకోవ‌చ్చు.

రావి ఆకులో ఔష‌ధ గుణాలు ఎన్నో ఉన్నాయి.అవి ఆరోగ్య ప‌రంగానే కాకుండా సౌంద‌ర్య ప‌రంగానూ ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.

ముఖ్యంగా చ‌ర్మంపై ఏర్ప‌డిన మ‌చ్చ‌ల‌ను మ‌టు మాయం చేసేందుకు రావి ఆకులు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఇంత‌కీ చ‌ర్మానికి రావి ఆకుల‌ను ఎలా ఉప‌యోగించాలి.? అన్న విష‌యాన్ని ఏ మాత్రం లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా నాలుగు లేదా ఐదు రావి ఆకుల‌ను తెచ్చుకుని నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.

ఇప్పుడు మిక్సీ జార్‌లో రావి ఆకుల‌ను వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకుని.అందులో చిటికెడు ప‌సుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముచ్చ‌ల‌పై అప్లై చేసి.ఇర‌వై నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.

Advertisement

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక‌.కేవ‌లం కొద్ది రోజుల్లోనే మ‌చ్చ‌లు త‌గ్గు ముఖం ప‌ట్టి ముఖం అందంగా మ‌రియు కాంతి వంతంగా త‌యారు అవుతుంది.పైగా రావి ఆకుల‌ను వాడ‌టం వ‌ల్ల ఎటు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు.

కాబ‌ట్టి, స్త్రీ.పురుషుల్లో ఎవ్వ‌రైనా ఈ రెమెడీని ట్రై చేయ‌వ‌చ్చు.

తాజా వార్తలు