శ్రీకాంత్ అడ్డాల (Sreekanth Addala) దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పెదకాపు 1(Peddha Kapu 1).ఒక గ్రామీణ నేపథ్యంలో కుల రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేకపోయినా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ చూసి సినిమాపై భారీగానే అంచనాలు పెరిగిపోయాయి.ఈ ట్రైలర్ చూడగానే శ్రీకాంత్ అడ్డాలకు ఒక సూపర్ హిట్ కాయమని అందరూ భావించారు.
ఇక ఈ సినిమా సెప్టెంబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా విడుదలైనటువంటి మొదటి షో నుంచి కూడా నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఒక్కసారిగా చిత్ర బృందం షాక్ అయ్యారు.
ఈ సినిమా పట్ల నెటిజన్స్ అలాగే క్రిటిక్స్ కూడా రివ్యూలు పెద్దగా పాజిటివ్గా ఇవ్వలేదు.స్కందకు సైతం బ్యాడ్ టాక్ ఉన్నప్పటికీ మాస్ కంటెంట్ తో( Mass Content ) పాటు రామ్ బ్రాండ్ జనాన్ని థియేటర్ల దాకా తీసుకొస్తోంది.
కానీ పెదకాపు సినిమా విషయంలో రివర్స్ అయ్యింది అని చెప్పాలి.పలువురు సినీ సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షోలు వేసినప్పటికీ అందరూ కూడా సినిమా బాగుందని చెప్పినప్పటికీ ఆ ప్రభావం మాత్రం ఈ సినిమా టికెట్ల విషయంలో చూపించలేకపోతుందని చెప్పాలి.

ఈ సినిమా కోసం శ్రీకాంత్ అడ్డాల(Sreekanth Addala) ఏకంగా 12 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది.కొత్త వ్యక్తిని హీరోగా పరిచయం చేయడమే కాకుండా ఇందులో శ్రీకాంత్ అడ్డాల కూడా విలన్ పాత్రలో నటించారు.ఇలా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా మొదటి రోజు కనీసం పాతిక లక్షల గ్రాస్ కలెక్షన్స్ కూడా రాబట్టకపోవడంతో ఒక్కసారిగా చిత్ర బృందం షాక్ అయ్యారు.

దీన్నిబట్టి చూస్తుంటే ఈ సినిమా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తుంది.మొదటి భాగం పరిస్థితి ఇలాగ ఉంటే తదుపరి భాగాలు ఎలా ఉండబోతాయన్నది ఇప్పుడు అందరిలోనూ ప్రశ్నార్థకంగా మారింది.శ్రీకాంత్ అడ్డాల ఒకేసారి ఈ సినిమాని మూడు భాగాలుగా చేయాలని ప్లాన్ చేశారు.
మరి ఈ సినిమా ప్రభావం తదుపరి సిగ్నల్ సినిమాలపై తప్పకుండా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.