Paytm RuPay క్రెడిట్‌ కార్డ్‌ వచ్చేసిందోచ్!

UPI యూజర్లు, Paytm ఖాదాదార్లకు తెలియజేయునది ఏమనగా… ఇపుడు చెల్లింపులు మరింత సులభతరం అయినాయి.ఈ మేరకు Paytm Payments Bank Ltd – PPBL ఒక సౌకర్యాన్ని తీసుకొచ్చింది.‘యూపీఐతో రూపే క్రెడిట్ కార్డ్’ను లింక్‌ చేసుకునే వెసులుబాటును Paytm ఇపుడు ప్రవేశ పెట్టింది.అంటే ఇందుమూలముగా తెలుసుకోవలసినది ఏమనగా వినియోగదార్లు తమ రూపే క్రెడిట్ కార్డ్‌లను UPI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఇపుడు తేలికగా జత చేసుకోవచ్చన్నమాట.

 Paytm Rupay క్రెడిట్‌ కార్డ్‌ వచ్చేస-TeluguStop.com

Telugu Latest, Paytm, Rupay Credit, Ups-Latest News - Telugu

ఇంకా మీకు తేలికగా అర్ధం కావాలంటే మీ డెబిట్‌ కార్డ్‌ లేదా బ్యాంక్ అకౌంట్లను UPIతో లింక్‌ చేసుకున్నట్లే మీ దగ్గరున్న రుపే క్రెడిట్‌ కార్డ్‌లను కూడా UPIకి ఇపుడు లింక్‌ చేసుకోవచ్చు.అంటే RuPay క్రెడిట్ కార్డ్ హోల్డర్లు UPI సర్వీస్‌ ద్వారా ఆన్‌లైన్ ఆఫ్‌లైన్‌లో కూడా చెల్లింపులు చేయవచ్చని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది.ఇక్కడ మీరు మీ క్రెడిట్‌ కార్డ్‌ను వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండానే, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి తేలికగా డబ్బుల చెల్లింపులు చేయవచ్చు.మీరు క్రెడిట్‌ కార్డ్‌ను మరిచిపోయి బయటకు వెళ్ళినపుడు కూడా కంగారు పడకుండా తేలికగా షాపింగ్‌ చేయవచ్చు.

Telugu Latest, Paytm, Rupay Credit, Ups-Latest News - Telugu

దీనివలన ఉపయోగాలు అనేకం వున్నాయి.కార్డ్‌‌ దుర్వినియోగం అయినపుడు బయటి వ్యక్తుల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదు.ఇకపోతే క్రెడిట్ కార్డ్‌లను UPIతో లింక్ చేయడానికి అనుమతి ఇస్తామని, ఈ సర్వీస్ RuPay క్రెడిట్ కార్డ్‌లతో ప్రారంభం అవుతుందని 2022 జూన్‌లో RBI గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించిన సంగతి విదితమే.ఇకపోతే దేశంలోని మొత్తం UPI లావాదేవీలు 2023 జనవరి నెలలో 8 బిలియన్లకు చేరుకున్నాయని ఓ సర్వే.వీటి ద్వారా దాదాపు రూ.12.98 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగినట్టు భోగట్టా.ఇప్పుడు, క్రెడిట్‌ కార్డ్‌ కూడా జత కలిస్తే లావాదేవీల సంఖ్య అతి భారీగా పెరుగుతుందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube