మంచు విష్ణు, సన్నీ లియోన్ తో పాయల్ రాజ్ పుత్ లంచ్ డేట్.. వైరల్ అయిన ఫోటోలు!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి అందరికీ పరిచయమే.తన అందంతో బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

 Payal Rajput Lunch Date With Manchu Vishnu And Sunny Leone Viral Details, Payal-TeluguStop.com

ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ తర్వాత పలు సినిమాలలో నటించగా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన పోస్టులతో యువతను బాగా పిచ్చెక్కిస్తుంది.

పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయమైన పాయల్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత తెలుగులో హీరో కార్తికేయ నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.ఈ సినిమాతో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న పాయల్.

ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.

ఇక వెంకీ మామ సినిమాలో, డిస్కో రాజా సినిమాలో నటించిన అంత సక్సెస్ ను అందుకోలేకపోయింది.

దీంతో ఇకపై తనకు సినిమా అవకాశాలు రావని అనుకున్నారు.కానీ ఇప్పుడు వరుస అవకాశాలతో ఖాతా నింపుకుంటుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే పాయల్ నిత్యం తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంటుంది.

Telugu Manchu Vishnu, Lunch, Payal Rajput, Payalrajput, Sourabh Dhingra, Sunny L

నిత్యం ఫోటో షూట్లతో బాగా సందడి చేస్తుంది.అప్పుడప్పుడు తన వ్యక్తిగతకు సంబంధించిన విషయాలను కూడా తెలుపుతుంది.గతంలో తన చిన్ననాటి స్నేహితుడు సౌరభ్ డింగ్రాతో ప్రేమాయణం లో ఉన్నట్లు చెప్పగా.ఆ విషయం బాగా వైరల్ గా మారింది.ఇక అతనితో ఒంటరిగా గడిపిన క్షణాలను.అతని తో దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటోంది.

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస ప్రాజెక్టులతో బాగా దూసుకుపోతుంది.టాలీవుడ్ లో కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తెగ అవకాశాలు అందుకుంటుంది.ప్రస్తుతం ఆమె ఖాతాలో మంచు విష్ణు సరసన ఓ సినిమాలో నటిస్తోంది.అంతేకాకుండా ఏంజెల్, కిరాతక, గోల్ మాల్ వంటి సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.

ఇక త్వరలో కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా ఓ సినిమా ద్వారా అడుగు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Manchu Vishnu, Lunch, Payal Rajput, Payalrajput, Sourabh Dhingra, Sunny L

ఇక మంచు విష్ణుతో కలిసి ఈమె చేసిన వీడియోలు యూట్యూబ్ లో బాగా వైరల్ గా మారుతున్నాయి.ఈమెతో పాటు బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ కూడా మంచు విష్ణుతో బాగా వీడియోలు చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా వీరు ముగ్గురు లంచ్ డేట్ లో ఉండగా వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది పాయల్ రాజ్ పుత్.

అందులో వాళ్ళు బాగా సందడి చేసినట్లు కనిపించింది.ఇక ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారగా తెగ లైకులు కొడుతున్నారు నెటిజన్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube