యూత్ స్టార్ నితిన్ హీరోగా మాస్ట్రో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే బాలీవుడ్ లో హిట్ అయిన ‘అంధాదున్‘ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా కీలక పాత్రలో నటిస్తున్నా విషయం విదితమే.బాలీవుడ్ లో టబు నటించిన పాత్రలో తెలుగులో తమన్నా నటిస్తుంది.
క్రైం త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ అంధుడి పాత్రలో కనిపించ బోతున్నాడు.ఈ సినిమా సెప్టెంబర్ 17న ఓటిటీ సంస్థ అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
ఈ సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను రాజ్ కుమార్ సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిలు నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత నితిన్ యాక్షన్ డైరెక్టర్ సురేందర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే ఈ భారీ మూవీ స్క్రిప్ట్ సురేందర్ రెడ్డి ఇప్పటికే రెడీ చేసినట్టు సమాచారం.ఇప్పుడు ఇక సూరి ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక చేస్తున్నాడట.ఈ క్రమంలోనే ఈ సినిమాలో నితిన్ కు జోడీగా ఓటిటి భామను తీసుకు రాబోతున్నాడని సమాచారం.

ఈ మధ్య వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తుంది.ఈ వెబ్ సిరీస్ లలో బాగా నటించి మెప్పించిన నటీనటులకు వెండితెర అవకాశాలు కూడా అందుతున్నాయి.ఇందుకు ఉదాహరణ తాజాగా సూరి ఒక వెబ్ సిరీస్ హీరోయిన్ ను వెండితెర మీద పరిచయం చేయబోతున్నాడట.
ఆమె పేరు పాయల్ రాధాకృష్ణన్ఈమె తరగతి దాటి బయట అనే వెబ్ సిరీస్ లో నటించింది.
ఈ వెబ్ సిరీస్ తో ఈ భామ సురేందర్ రెడ్డి దృష్టిలో పడిందని తెలుస్తుంది.
ఈ అమ్మడికి ఈ వెబ్ సిరీస్ మంచి పేరు తెచ్చిపెట్టింది.ఇప్పుడు సూరి కనుక నితిన్ సినిమాలో ఈ భామకు అవకాశం ఇస్తే ఇక బ్యూటీ కెరీర్ టర్న్ అయినట్టే.
మరి చూడాలి ఇందులో నిజమెంతో.