తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ పాయల్ ఘోష్( Payal Ghosh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ ముద్దుగుమ్మ పేరు వినగానే ప్రయాణం ఊసరవెల్లి వంటి సినిమాలు గుర్తుకు వస్తూ ఉంటాయి.
ఈ సినిమాలతో బాగానే పాపులారిటీ సంపాదించుకుంది పాయల్.కాగా ఈ ముద్దుగుమ్మ చివరగా 2017 లో విడుదలైన ఒక హిందీ సినిమాలో నటించింది.
సినిమాలకు దూరమైనా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది.ఒక రాజకీయ పార్టీలో చేరి రాజకీయాలలో మరింత యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ.

తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే వస్తోంది పాయల్.ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఆమె చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.పాయల్ తన కామెంట్స్, తన ట్వీట్స్ తో లేనిపోని వివాదాలను కొని తెచ్చుకుంటోంది.తరచూ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన ట్వీట్లు చేస్తూనే వస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి బాలీవుడ్( Bollywood ) ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేసింది.ఆ ట్వీట్ లో గతంలో బాలకృష్ణతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.
బాలీవుడ్ నటులు బాలకృష్ణ( Balakrishna ) సార్ ని చూసి నేర్చుకోవాలి.ఆయన ఈ వయసులో కూడా వరుస హిట్స్ ఇస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది./br>

దీంతో ఈ ట్వీట్ వైరల్ అవ్వగా పలువురు బాలయ్య అభిమానులు సంతోషంతో కామెంట్స్ చేస్తున్నారు.కాగా కొందరు బాలీవుడ్ నెటిజన్స్ ఆ ట్వీట్ పై స్పందిస్తూ ఆమెపై విమర్శలు చేస్తున్నారు.అయితే ఎవరు ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసినా కూడా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది పాయల్ ఘోష్.ఇకపోతే ఆమె కెరియర్ విషయానికి వస్తే.
ప్రస్తుతం పాయల్ ఘోష్ ఇప్పుడిప్పుడే మళ్ళీ వీడియో ఆల్బమ్స్, యూట్యూబ్ లలో, ఓటీటీలలో నటిస్తూ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.







