మానవత్వం చాటుకున్న పాయకరావుపేట పోలీసులు

విశాఖ పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న స్వీపర్ కూతురి వివాహం కుదురగా , తన పేదరికం కోసం పోలీసుల కు లక్ష్మీ తెలియజేయగా, తక్షణమే స్పందించిన పోలీసులు తమ వంతు సహాయం చేశారు.ఇది చూచిన పాయకరావుపేట లోని పెద్దలు, నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లక్ష్మి కి ఇతోధిక సహాయం చేశారు పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో గత పది సంవత్సరాలుగా స్వీపర్ గా పనిచేస్తున్న లక్ష్మీ కుటుంబానికి పలు పార్టీల నాయకులు, పోలీసులు ఆసరాగా నిలిచారు.

 Payakaravupeta Police Who Expressed Humanity-TeluguStop.com

స్వీపర్ లక్ష్మి కుమార్తె వివాహం సందర్భంగా సుమారు లక్షన్నర విలువైన గృహోపకరణాలను సారెగా అందజేశారు.పాయకరావుపేట పోలీసు సిబ్బంది వారి సొంత నిధులతో బంగారు చెవిదిద్దులు, వెండిపట్టీలు స్వీపర్ లక్ష్మి కుమార్తెకు బహుమతి గా అందజేశారు.

ఈ కార్యక్రమంలో నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణరావు, పాయకరావుపేట ఎస్సైలు పి.ప్రసాదరావు, మహిళా ఎస్సై శిరీష, ఏఎస్ఐ గోవిందరావు, నాయకులు దగ్గుపల్లి సాయిబాబా, వంకా వెంకటరమణ, గెడ్డం చైతన్య, అశోక చక్రవర్తి , నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube