టీడీపీ అధినేత చంద్రబాబు స్కెచ్ ప్రకారమే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ అన్నారు.పవన్ వలనే కాపులు తిట్టుకుంటున్నారన్నారు.
ఎన్టీఆర్ చనిపోవడానికి కారణం చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.కాపులను కించపరుస్తూ చంద్రబాబును పొగడటం ఏంటని ప్రశ్నించారు.
చంద్రబాబును అభిమానించే నువ్వు గొప్పవాడివా.? ముద్రగడ గొప్పవాడా.? అని అడిగారు.సినిమా హీరో కాబట్టి చూడటానికి మాత్రమే ప్రజలు వస్తున్నారని తెలిపారు.
గతంలో చంద్రబాబు, లోకేశ్ ను తిట్టిన పవన్ ఇప్పుడు వాళ్ల కోసం పనిచేయడం ఏంటని ప్రశ్నించారు.ఈ క్రమంలో తాను ఏం చేస్తున్నాడో ఆలోచించుకోవాలని పవన్ కు సూచించారు.